Share News

JP Nadda: మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:51 PM

మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించదగిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

JP Nadda: మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు
JP Nadda

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రభుత్వ 11 సంవత్సరాల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అభివర్ణించారు. మోదీ పాలన భారతదేశానికి కొత్త యుగమని వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో ఏ దేశ ప్రభుత్వం చేయనంత పని భారతదేశ ప్రభుత్వం చేసిందని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల విజయాలను జేపీ నడ్డా వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ పాలనపై జేపీ నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు.


ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించదగిందని జేపీ నడ్డా తెలిపారు. 11 సంవత్సరాల ప్రధాని మోదీ వికసిత భారత్ పునాదిని నిర్మించారని.. ఇది పారదర్శకమైన భవిష్యత్ ప్రభుత్వమని వివరించారు. 2014కి ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో నిండిపోయిందని ఆరోపించారు. 2014 తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజల భావన మారిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రజలు గర్వంగా మోదీహైతో ముమ్కిన్ హై అని అంటున్నారని గుర్తుచేశారు జేపీ నడ్డా.


గత 11 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అనే మంత్రంతో ముందుకు సాగిందని జేపీ నడ్డా వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని వివరించారు. మరో సాహసోపేతమైన నిర్ణయం కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, నోట్ల రద్దు, 33శాతం మహిళా రిజర్వేషన్లు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను మోదీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు 126 నుంచి 18 జిల్లాలకు తగ్గాయని జేపీ నడ్డా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

మస్క్‌ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్‌కు సూర్యుడి దెబ్బ..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 02:02 PM