Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:56 PM
International Women's Day:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మహిళా సిబ్బందికి అరుదైన గౌరవం ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపే అవకాశం కల్పించింది. దీనిపై సర్వత్రా..

International Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. CSMT-షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో నేడు (మార్చి 08) పూర్తిగా మహిళా సిబ్బంది ఉన్నారు. వీరిలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సహా అందరూ మహిళలే. సెంట్రల్ రైల్వేస్ ఇదే విషయాన్ని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఈ క్షణాలు అత్యంత గర్వకారణం, చారిత్రాత్మకమని అభివర్ణించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చరిత్రలో తొలిసారి ఈ రికార్డు..
సెంట్రల్ రైల్వేస్ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం మహిళా సిబ్బందితోనే చరిత్రలో తొలిసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుపుతోంది. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా ఇలా పంచుకుంది. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు CSMT నుండి బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బంది నడుపుతున్నారు. రైలు నంబర్ 22223 CSMT - సాయినగర్ షిర్డి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈరోజు CSMT నుండి పూర్తిగా మహిళా సిబ్బందితో బయలుదేరింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైలు మేనేజర్, టికెట్ ఎగ్జామినర్లు, రైలు మేనేజర్, TCలు, రైలు హోస్టెస్, ఆన్-బోర్డ్ క్యాటరింగ్ ఇలా అంతా మహిళలే. భారతీయ రైల్వేలో మహిళల బలం, అంకితభావం, నాయకత్వాన్ని తెలియజెప్పే ఈ రోజు మాకు గర్వించదగ్గ క్షణం" అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
స్త్రీకి కష్టమైన పనంటూ ఏదీ ఉండదు..
సెంట్రల్ రైల్వే ప్యాసింజర్ రైలు మేనేజర్ శ్వేతా ఘోన్ మాట్లాడుతూ, "ఇది మాకు గర్వకారణమైన క్షణం... ప్రసవవేదనే భరించగలిగిన ఒక స్త్రీకి కష్టతరమైన పనంటూ ఏది ఉండదని నా అభిప్రాయం. ఆమె చేయలేనిదంటూ ఏముంది? సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తే.. అలాంటి మహిళ తన మొత్తం కుటుంబాన్ని సమర్థులైన వ్యక్తులుగా మార్చగలదు. ప్రతి స్త్రీ ఇలాగే జీవితంలో ఎదగగలిగితే.. మన దేశం ఎలా అభివృద్ధి చెందదు" అని అన్నారు.
Read Also : నటి రన్యా రావు ముఖంపై గాయాలు.. డీఆర్ఐ అధికారుల ఏం చెప్పారంటే..
మల్టీప్లెక్స్‌లోనూ రూ.200లోపే సినిమా టికెట్!
డిప్యూటీ సీఎం ఆగ్రహం.. భాష గురించి అడిగితే ఈడీతో దాడులా..