Ginger-Garlic Paste: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్..!
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:04 PM
ఇంట్లో తయారుచేసినప్పటికీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదా? నిల్వ ఉన్నప్పటికీ తాజాగా అనిపించడం లేదా? అయితే, తయారీ, నిల్వ విధానంలో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి. కొన్ని వారాలు గడిచినా చెడిపోదు. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

Ginger-Garlic Paste Storage Tips: దాదాపు ప్రతి భారతీయ వంటకంలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉపయోగిస్తారు. ఈ రెండు పదార్థాల మిశ్రమం ఆహారపదార్థాల రుచిని రెట్టింపు చేయడమే కాకుండా.. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే, వెల్లుల్లి తొక్క తీయడానికి చాలా సమయం పడితే.. అల్లాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయలేం. బయటే ఉంచితే త్వరగా ఎండిపోతుంది. అందుకని చాలామంది ఇంట్లోనే తయారుచేసి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, తయారీ విధానంలో చేసే చిన్న తప్పుల కారణంగా ఈ పేస్ట్ త్వరగా పాడవుతుంది. ఇలా జరగకూడదంటే.. ఈ టిప్స్ ప్రయత్నించండి. వారాలు గడిచినా ఫ్రెష్‌గా ఉంటుంది.
అల్లం-వెల్లుల్లి పేస్ట్ నిల్వ చిట్కాలు
1.అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కోసం ఎల్లప్పుడూ తాజా అల్లం, వెల్లుల్లిని ఉపయోగించండి. 60 శాతం వెల్లుల్లి, 40 శాతం అల్లం మాత్రమే తీసుకోవాలి. వాటిని శుభ్రమైన ఫుడ్ ప్రాసెసర్‌లో రుబ్బుకోండి. దానికి చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ జోడించండి. ఇవి నల్లగా మారకుండా నిరోధిస్తాయి. బ్యాక్టీరియాను దరిచేరనీయవు.
2. పేస్ట్ బ్లెండ్ చేసేటప్పుడు ఎప్పుడూ నీరు కలపకండి. ఎందుకంటే త్వరగా చెడిపోతుంది. ఒకవేళ మిశ్రమం గట్టిగా ఉంటే కొంచెం నూనె వేయండి. నీటిని మాత్రం ఉపయోగించవద్దు. నీరు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. కానీ నూనె దానిని మృదువుగా, తాజాగా ఉంచుతుంది.
3. పేస్ట్‌ను శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. దానిని బయటకు తీయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన, పొడి చెంచా ఉపయోగించండి. సరిగ్గా నిల్వ చేస్తే అది 2-3 వారాల పాటు తాజాగా ఉంటుంది.
4. నెలల తరబడి తాజాగా ఉంచాలనుకుంటే అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రీజ్ చేయండి. పేస్ట్‌ను ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసిన తర్వాత క్యూబ్‌లను జిప్‌లాక్ లేదా గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
5.మీ పేస్ట్ వింతైన వాసన, రుచి లేదా ఆకుపచ్చగా మారితే దానిని పారవేయండి. బ్లెండ్ చేస్తున్నప్పుడు వెనిగర్ జోడించడం వల్ల రంగు మారడం తగ్గుతుంది. అలాగే తడి చెంచాను ఎప్పుడూ జాడీలో ముంచకండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
వర్షాకాలంలో ఆరోగ్యకరమైన 5 వెజిటేరియన్ సూప్‌లు ఇవే..!
శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?
For More Lifestyle News