Share News

Aadhaar Address Update Online: ఆధార్ అడ్రస్ అప్‌డేట్.. ఇలా ఇంటి నుంచే చేసుకోండి

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:58 PM

మీ ఆధార్‌లో అడ్రస్ మారిందా. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈజీగా ఆన్‌లైన్‌ విధానంలో అప్‌డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Aadhaar Address Update Online: ఆధార్ అడ్రస్ అప్‌డేట్.. ఇలా ఇంటి నుంచే చేసుకోండి
Aadhaar address update online

ఇటీవల మీరు కొత్త ఊరికి మారినా? లేదా మీ ఆధార్‌ చిరునామాలో ఏదైనా తప్పు ఉందని గమనించినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ ఆధార్ చిరునామాని అప్‌డేట్ (Aadhaar Address Update Online) చేసుకోవాలి. దీని కోసం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్లాల్సిన పనిలేదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, చెల్లుబాటు అయ్యే చిరునామా ఫ్రూఫ్ ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.


ఆధార్ చిరునామా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే ప్రాసెస్

  • దీని కోసం ముందుగా myAadhaar వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి

  • ఆ క్రమంలో కుడివైపున ఉన్న లాగిన్ బటన్ క్లిక్ చేయండి

  • తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన OTPతో లాగిన్ అవ్వండి

  • తర్వాత Address Update ఆప్షన్‌ని క్లిక్ చేయండి

  • Update Aadhaar Online సెలెక్ట్ చేసుకోండి

  • సూచనలను చదివి Proceed to Update Aadhaarపై క్లిక్ చేయండి

  • స్క్రీన్‌పై వచ్చే సూచనలను జాగ్రత్తగా చదవి, ఆపై ప్రొసీడ్ చేయండి


  • అక్కడ మీ కొత్త అడ్రస్ ఎంటర్ చేయండి

  • అవసరమైతే Care of (C/O) వివరాలతో సహా నమోదు చేయండి

  • చెల్లుబాటు అయ్యే మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయండి

  • తర్వాత Next బటన్ క్లిక్ చేయండి

  • మీ వివరాలను రివ్యూ చేసి రూ.50ఫీజు (నాన్-రీఫండబుల్) చెల్లించి, మీ రిక్వెస్ట్‌ని సబ్మిట్ చేయండి

  • అంతే! మీ ఆధార్ చిరునామా అప్‌డేట్ ప్రాసెస్ పూర్తవుతుంది. UIDAI నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.


ఆధార్ అప్డేట్ కు కావాల్సిన డాక్యుమెంట్లు..

UIDAI 15 కంటే ఎక్కువ రకాల అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అంగీకరిస్తుంది. వాటిలో

  • పాస్‌పోర్ట్

  • బ్యాంక్ లేదా పోస్టాఫీస్ స్టేట్‌మెంట్/పాస్‌బుక్

  • రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడీ, ప్రభుత్వం జారీ చేసిన డిసేబిలిటీ ఐడీ కార్డు

  • MGNREGA/NREGS జాబ్ కార్డు

  • యూటిలిటీ బిల్లులు (విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్) గత 3 నెలల్లో జారీ అయినవి

  • లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ

  • రిజిస్టర్డ్ సేల్ లేదా గిఫ్ట్ డీడ్

  • ప్రాపర్టీ టాక్స్ రసీదు (గత 1 సంవత్సరంలో జారీ అయినది)

  • నాన్-రిజిస్టర్డ్ రెంట్ లేదా లీజ్ అగ్రిమెంట్

  • పాన్ కార్డు

  • ఓటర్ ఐడీ


ఇవి కూడా చదవండి

గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 01:37 PM