Share News

Sunita Williams : సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అనుకోని అతిథులు.. థ్రిల్లింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:48 PM

Sunita Williams Viral Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్‌‌లను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. ఆ క్షణంలోనే అనుకోని అతిథులు ఎదురొచ్చి వీరికి స్వాగతం పలికి ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

Sunita Williams : సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అనుకోని అతిథులు.. థ్రిల్లింగ్ వీడియో వైరల్..
Sunita Williams Dolphins Viral Video

Dolphins Welcome Sunita Williams : వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలల కఠిన నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భూమిపై కాలుమోపారు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు. తోటి నాసా(NASA) వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి స్సేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్‌లో సురక్షితంగా ఫ్లోరిడా తీరంలో దిగారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమిపైన అడుగుపెట్టారు క్రూ-9 వ్యోమగాములు. కచ్చితంగా అదే సమయంలో ఫ్లోరిడా సముద్రాల జలాలపై ఈదుతూ ఉన్న ఈ జీవులు సునీతా విలియమ్స్ బృందం ఉన్న వ్యోమనౌక చుట్టూ చక్కర్లు కొడుతూ వెల్కం చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తాయి.


క్యాప్సుల్ ల్యాండ్ అవగానే ఇవొచ్చి..

సునీతా విలియమ్స్ క్యాప్సుల్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగగానే క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ మొదలైంది. అదే సమయంలో ఆ చుట్టుపక్కల సంచరిస్తున్న డాల్ఫిన్లు వీరు ప్రయాణించిన వ్యోమనౌక చుట్టూ మూగి ఉత్సాహంగా కలియతిరుగుతూ కేరింతలు కొట్టాయి. ఒకటి రెండు కాదు. దాదాపు అరడజను డాల్ఫిన్లు సునీతా విలియమ్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ చుట్టూ తిరుగుతూ సందడి చేశాయి. ఈ అనుకోని అతిథులు తమని ఆహ్వానిస్తున్నట్లే అనిపించడంతో వ్యోమగాములు ఆశ్చర్యం, సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


గత సంవత్సరం జూన్ 5వ తేదీన వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో స్పేస్ నుంచి బయల్దేరిన సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. క్షేమంగా భూమిపైకి చేరాలని కోరుతూ చేసిన ప్రార్థనలు నిజమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున వారు క్షేమంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. ఆ క్షణంలోనే డాల్ఫిన్లు మీకిదే మా ఆహ్వానం అన్నట్టుగా వీరి వ్యోమనౌక చుట్టూరా చక్కర్లు కొడుతూ సందడి చేశాయి.


Read Also : Sunita Williams India Visit: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు

Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..

Elon Musk: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 19 , 2025 | 01:49 PM