TIME's Most Influential People: టైమ్స్ జాబితాలో ట్రంప్, యూనస్.. చోటు కోల్పోయిన ఇండియన్స్
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:08 PM
TIME's 100 Most Influential People of 2025: టైమ్స్ మ్యాగజైన్ ఎప్పట్లాగే ఈ ఏడాదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన టాప్ 100 వ్యక్తుల జాబితా విడుదల చేసింది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.

TIME's 100 Most Influential People of 2025: టైమ్స్ మ్యాగజైన్ 2025 గానూ ప్రపంచంలో వివిధ రంగాలకు చెందిన 100 మంది మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ (TIME's Most Influential People) జాబితాను విడుదల చేసింది. ఇందులో ట్రంప్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, యూకే ప్రధాని కీవ్ స్టార్మర్, ప్రపంచ కుబేరుడు.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ జాబితాలో రాజకీయాలు, సైన్స్, కళలు, ఇతర క్రియాశీల రంగాల్లో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో తొలిసారి భారతీయ పౌరుల్లో ఒక్కరికీ కూడా చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ, 11 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ CEO గా వ్యవహరిస్తున్న రేష్మా కేవల్రమణికి లీడర్స్ విభాగంలో టైమ్స్ జాబితాలో స్థానం దక్కింది.
2025 టైమ్స్ లిస్ట్ లో లీడర్స్ కేటగిరీలో అమెరికా అధినేత ట్రంప్, బంగ్లా తాత్కాలిక సారథి యూనస్, యూకే ప్రధాని కీవ్ స్టార్మర్, టెస్లా సీఈవో మస్క్ తో పాటు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ భామ్, వెనెజులా ఐరన్ లేడీ మరియా కోరినా మచాడో ఉన్నారు. ఇంకా మార్వెల్ సిరీస్ ఫేం స్కార్లెట్ జాన్సన్, సింగర్ ఎడ్ షీరన్, నటి డెమీ మూర్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ వంటి ప్రముఖులకు స్థానం లభించింది. గతేడాది ఇండియా నుంచి అలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మలిక్‌కు వంటి భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన అనేక మందికి చోటు దక్కింది. ఈ సారి టైమ్స్ జాబితాలో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also: Trump China trade war: చైనాను ఒంటరిని చేద్దాం
China India relations: భారతీయులపై చైనా వీసాల వర్షం!
Trump offer: డబ్బులిస్తాం.. విమానం టికెట్ ఇస్తాం.. వెళ్లిపోండి!