Donald Trump : డ్రిల్ బేబీ డ్రిల్.. ద్రవ్యోల్బణాన్ని ఓడిద్దాం.. కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్..
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:59 PM
Donald Trump : అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన సంయుక్త కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రసంగంలో అనేక సంచలన ప్రకటనలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అందులో ద్రవ్యోల్బణ సమస్య గురించి మాట్లాడుతూ 'డ్రిల్ బేబీ డ్రిల్' అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Donald Trump Drill Baby Drill : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాంగ్రెస్ ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఇంధన విధానం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ద్రవ్యోల్బణ సమస్యను ధీటుగా ఎదుర్కొనేందుకు "డ్రిల్ బేబీ డ్రిల్" అంటూ విభిన్న విధానాన్ని ప్రతిపాదించారు. చమురు, గ్యాస్ (Oil And Gas) ప్రణాళికలను గురించి చెప్తూ.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, అనవసర ఖర్చులను కచ్చితంగా అరికట్టే పద్ధతి ఇదే అని చెబుతూ ఈ పదాన్ని ప్రస్తావించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అసలేంటీ.. 'డ్రిల్ బేబీ డ్రిల్'..
తొలి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ (Donald Trump) ప్రసంగం ప్రధానంగా ఇంధన విధానంపై సాగింది. ఆహారం, ఇంధనం, ద్రవ్యోల్బణం, చమురు, గ్యాస్(Oil And Gas) తదితర ప్రణాళికలపై ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణ సమస్య, ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు 'డ్రిల్ బేబీ డ్రిల్' (Drill Baby Drill) విధానం అత్యుత్తమమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణ సమస్యలు ఎదుర్కొవటానికి జో బైడెన్ నేతృత్వంలోని గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడీ సమస్యల్లోంచి బయటపడే మార్గం మన భూమి కిందే ఉందని చెప్పుకొచ్చారు.
'డ్రిల్ బేబీ డ్రిల్' అంటే..
జో బైడెన్ అసమర్థ పాలన కారణంగా దేశంలో ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకుందని గత ప్రభుత్వ చర్యలను నిందించారు ట్రంప్. అందుకే అందుకే ద్రవ్యోల్బణాన్ని ఓడించడానికి ప్రధానంగా ఇంధన వ్యయం వేగంగా తగ్గించడంపైనే దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఇందుకోసం చేసిన ప్రణాళికే 'డ్రిల్ బేబీ డ్రిల్' అన్నారు. దీని గురించి మాట్లాడుతూ, "భూమిపై ఉన్న అన్ని దేశాల కంటే మన కాళ్ళ కింద ఎక్కువ ద్రవ రూప బంగారం (చమురు, గ్యాస్) ఉంది. నేను మా బృందానికి వీటిని తవ్వి తీసేందుకు పూర్తి అధికారం ఇస్తున్నాను. వీటి సాయంతో ఇంధన ఖర్చులను తగ్గించి ద్రవ్యోల్బణ సమస్యను ఓడిస్తాం. దీనినే డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు" అని పేర్కొన్నారు. ట్రంప్ ఈ మాట అనగానే సభలో రిపబ్లికన్ సభ్యులంతా "డ్రిల్ బేబీ డ్రిల్" అంటూ గట్టిగా నినదించారు.
పదవిలో చేరిన మొదటి రోజే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ట్రంప్. బైడెన్ పరిపాలనలో 100 కి పైగా మూసివేసిన విద్యుత్ ప్లాంట్లను చాలా వరకు తిరిగి తెరుస్తున్నామని ప్రసంగంలో తెలిపారు. ద్రవ్యోల్బణ సమస్యపై పోరాటం చేసేందుకు ఇంధన ఖర్చులను తగ్గించడంపై వేగంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. "డ్రిల్ బేబీ డ్రిల్" (Drill Baby Drill) ప్రణాళికలో భాగంగా అలాస్కాలో భారీ సహజ వాయువు పైప్‌లైన్, కీలకమైన ఖనిజ ఉత్పత్తిని విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో 13 ఏళ్ల బాలుడు.. ట్రంప్ ఆ పిల్లాడిని ఎందుకు నియమించారు?
Donald Trump: ఉక్రెయిన్‌కు సైనికసాయం బంద్
US-China Trade War: సుంకాల యుద్ధం