Share News

Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 06:41 PM

Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన 14వ బిడ్డకు తండ్రి అయినట్లు సహజీవన భాగస్వామి న్యూరోలింక్‌ ఎగ్జిక్యూటివ్‌ షివోన్ జిలిస్‌‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇంతటితో ఆగనని.. మరి కొందరు పిల్లలకూ తండ్రి కావాలని ఉందని.. ఇందువల్లే ఈ నిర్ణయం..

Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Musk and shivon zilis 14th son

Elon Musk : బిలియనీర్, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు 14 మంది పిల్లలు. తాజా గా 14వ కుమారుడి కి ఎలన్ మస్క్ స్వాగతం పలికారు. 2002-2025 మధ్యలో మస్క్ కు 14 మంది సంతానం. ఇంతటి తో ఆగేదే లేదు అంటున్న మస్క్. మరి కొందరు పిల్లలకూ తండ్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు జనాభా తరిగిపోతోందనే ఆందోళనలో ఉన్నాయి. పిల్లలను కనమని చైనా చెబుతున్నా అక్కడి ప్రజలు ఒకరు లేదా ఇద్దరికే పరిమితం అవుతున్నారు. ఎలన్ మస్క్ మాత్రం తన వారసుల సంఖ్యను పెంచడం ద్వారా జనాభా వృద్ది కి సహకరిస్తున్నానని అంటున్నారు.


ఎలన్ మస్క్ 2000 సంవత్సరంలో జస్టిన్ విల్సన్ ను వివాహం చేసుకున్నారు. 2002 లో వారికి ఒక బాలుడు జన్మించాడు. అయితే పది వారాల్లోనే అనారోగ్యంతో ఆ బాలుడు మరణించాడు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా విల్సన్ కు 2004 లో కవలలు. కవలలు ఇద్దరూ బాలికలు. ఇందులో ఒకరు 2022 లో ట్రాన్స్ జెండర్ గా మారింది. మళ్ళీ ఐవీఎఫ్ ద్వారా 2006 లో ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు పిల్లలు జన్మించారు. మొదటి భార్య కు ఆరుగురు పిల్లలు అయితే ఒకరు చనిపోయారు. 2008 లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మస్క్... తరువాత ఒక నటిని వివాహం చేసుకున్నాడు. కాని వీరికి పిల్లలు లేరు. అనంతరం సింగర్ గ్రింస్ తో మస్క్ డేటింగ్ చేశాడు. వీరురువురికీ 2020 లో ఒక బాలుడు జన్మించాడు. ఇతడే వైట్ హౌస్‌లో ట్రంప్‌తో ఆటాడుకున్నఎక్స్.


మస్క్ మరో ఇద్దరు...రచయిత ఆశ్లే, షివోన్ జిలిస్‌తో కూడా సహజీవనం కొనసాగిస్తున్నాడు. గత నెలలో తనకు 4వ కుమారుడు జన్మించాడని షివోన్ జిలిస్, మస్క్ తాజాగా వెల్లడించారు. తమ 14వ సంతానానికి సెల్డాన్‌ లైకుర్గస్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. రచయిత ఆశ్లే కూడా తాను 5 నెలల పాపకు మస్క్ ద్వారా తల్లిని అయినట్లు స్వయంగా వెల్లడించింది. ప్రప్రంచంలో జనన రేటు తగ్గిపోతోందని ఈ సమస్యకు పరిష్కారం దిశలో తాను ముందుకు వెళుతున్నానని అంటున్నాడు మస్క్


Read Also : Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే

Donald Trump: మాకేంటి?.. అహ! మాకేంటి?

EU Bans Caffine : 27 దేశాల్లో కెఫీన్ వాడకం నిషేధం.. బాంబు పేల్చిన EU..

Updated Date - Mar 02 , 2025 | 06:42 PM