Share News

Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..

ABN , Publish Date - May 14 , 2025 | 04:41 PM

Hidden Sugar Foods: నేటి కాలంలో ఆహారంలో తక్కువ చక్కెర ఉండేలా చూసుకుంటున్నారు ప్రజలు. అందుకు బదులుగా రోజూ కొన్ని హెల్తీ ఫుడ్స్ తినాలనే రూల్ పెట్టుకుంటున్నారు. కానీ, ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు. ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో వారికి తెలియకుండానే ఈ కింది పదార్థాలను రోజూ తినేస్తున్నారు. వీటి వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..
Sugar Foods

Healthy Looking Unhealthy Foods: ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి నేటి తరానికి చాలా అవగాహన ఉంది. ఈ రోజుల్లో జిమ్, డైటింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అంతేగాక, షుగర్ లెస్ ఫుడ్ అనే ట్రెండ్ కూడా ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవారు చక్కెరను దాదాపు తినరు. తీపి కోసం సహజ పండ్లను మాత్రమే ఎంచుకుంటారు. కానీ అసలు సమస్య ఏమిటంటే ఆరోగ్యకరమైనవిగా భావించి వీరు రోజూ తినే ఈ ఆహారాల్లో పెద్ద మొత్తంలో చక్కెర దాగి ఉంటుంది. చక్కెర తినటం లేదని భావిస్తూ ఇవి తినటం వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, హెల్తీ ఫుడ్స్ పేరుతో మీరు తినే అనారోగ్యకరమైన పదార్థాలేంటో తెలుసుకోండి.


యోగర్ట్

ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ పేరుతో యోగర్ట్ తినే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియుల ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారు. ఐస్ క్రీం వంటివి తినడానికి బదులుగా రుచికరంగా ఉండే ఈ లో ఫ్యాట్ యోగర్ట్ తింటే ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతున్నారు. నిజమేంటంటే ఎక్కువ రుచిగా ఉండే పెరుగు ఆరోగ్యకరమైనది కాదు. ఇందులో చాలా చక్కెర ఉంటుంది. ఇది మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండింటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, సాధారణ పెరుగు తినడం మంచిది. మీకు కావాలంటే పెరుగులో దానిమ్మ గింజలు, ద్రాక్ష వంటి పండ్లు కలుపుకుని తిన్నా రుచిగా ఉంటుంది.


ప్యాకెట్‌ జ్యూస్‌లు

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించే చాలామంది ఇటీవల తరచుగా వారి ఆహారంలో ప్యాక్ చేసిన పండ్లు, కూరగాయల రసాలను చేర్చుకుంటున్నారు. ఇది బెస్ట్ డైట్ ప్లాన్ అని మీకు అనిపించవచ్చు. కానీ వీటిలో అధిక మోతాదులో చక్కెర కలుపుతారు. ముఖ్యంగా "100% స్వచ్ఛమైనవి" అని లేబుల్ చేసిన పండ్ల రసాల్లో అధిక చక్కెర ఉంటుంది. ఇవి తాగితే చక్కెర సోడాలు తాగినట్టే. ఇన్సులిన్ స్పైక్‌కు దారితీస్తుంది. కాబట్టి, జ్యూస్ తాగడానికి బదులుగా పండ్లను కోసి అలాగే తినడం మంచిది. అప్పుడే ఫైబర్ కంటెంట్ శరీరానికి అందుతుంది.


టమాటో కెచప్, సాస్

అది బోరింగ్ సలాడ్ అయినా లేదా శాండ్‌విచ్ అయినా, కెచప్, వివిధ రకాల సాస్‌లు వాటిని మరింత రుచికరంగా మారుస్తాయి. కానీ, మీకు తెలియని విషయమేంటంటే వీటిలో చక్కెర కూడా ఉంటుంది. ఇది మీ ఆహారాన్ని అనారోగ్యకరంగా మారుస్తుంది. ముఖ్యంగా టొమాటో కెచప్, బార్బెక్యూ సాస్, స్వీట్ చిల్లీ సాస్‌లలో, టేస్ట్ ఇంగ్రిడియెంట్స్ పేరుతో చాలా చక్కెర కలుపుతారు. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంట్లో తయారుచేసిన సాస్‌ను వాడండి లేదా చక్కెర లేదా కెచప్ జోడించని సాస్‌ను ఎంచుకోండి.


తృణధాన్యాలు

మీరు ఆరోగ్యకరమైన అల్పాహారం పేరుతో బ్రేక్ ఫాస్ట్ లో సెరియల్స్ తింటుంటే కచ్చితంగా దాని లేబుల్‌ని ఒకసారి తనిఖీ చేయండి. నిజానికి, మార్కెట్లో లభించే చాలా అల్పాహార తృణధాన్యాలు కృత్రిమ రుచులతో వస్తున్నాయి. వీటిలో చాలా చక్కెర ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. పైగా బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి, లేబుల్‌ని జాగ్రత్తగా పరిశీలించి చక్కెర లేని తృణధాన్యాలను ఎంచుకోండి.


ఎనర్జీ, ప్రోటీన్ బార్స్

ఈ రోజుల్లో ఫిట్‌నెస్ ప్రియులు సాధారణ చాక్లెట్లకు బదులుగా ఎనర్జీ, ప్రోటీన్ బార్‌లను తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాటిని తినేటప్పుడు కూడా మీరు కచ్చితంగా వాటి లేబుల్‌ని చెక్ చేయండి. ఎందుకంటే చాలా ఎనర్జీ, ప్రోటీన్ బార్లలో షుగర్ సిరప్ ఉంటుంది. మీరు ఆరోగ్యంగా భావిస్తూ తినే వీటిలో చాలా చక్కెర యాడ్ చేస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ ఇంగ్రిడియెంట్స్ జాబితాను తనిఖీ చేయండి. చక్కెర కలపని బార్‌లను ఎంచుకోండి.


Read Also: Health Tips: హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేయండి..

Hyderabad: ఇక.. ఇంటి వద్దకే వైద్య సేవలు

Papaya Health Benefits: ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే 5 అద్భుతమైన

Updated Date - May 14 , 2025 | 06:00 PM