Share News

Fake Apple: వ్యాక్స్ చేసిన ఆపిల్ తింటున్నారేమో.. చెక్ చేసుకోండిలా!

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:49 PM

నేటి కాలంలో నకిలీ పండ్లు, కూరగాయల అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా మైనపు పూతతో వేసిన నకిలీ ఆపిల్స్ విచ్చలవిడిగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఆరోగ్యం కోసమని ఈ ఆపిల్స్ తింటే రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువ. ఈ చిట్కాల సహాయంతో నకిలీ ఆపిల్స్ గుర్తించి జాగ్రత్త పడండి.

Fake Apple: వ్యాక్స్ చేసిన ఆపిల్ తింటున్నారేమో.. చెక్ చేసుకోండిలా!
Fake vs Real Apple Fruit

How to Spot Fake Apples: రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదని నానుడి. ప్రస్తుత పరిస్థితులు ఈ అర్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. మార్కెట్లో వివిధ రకాల నోరూరించే ఆపిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా వరకూ నకిలీవే అంటే నమ్మలేరు. ఆపిల్ ను మెరిసేలా చేయడానికి చాలా మంది దుకాణదారులు దానిపై మైనం పూస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఆపిల్ కొనడానికి ముందు అది నకిలీదా కాదా అని తెలుసుకోవడం ముఖ్యం.


వ్యాక్స్ చేసిన ఆపిల్ ఆరోగ్యానికి ప్రమాదకరం

మైనంతో కూడిన ఆపిల్స్ తినడం వల్ల అనేక రకాల హాని జరిగే ప్రమాదం ఉంది. చాలా సార్లు ప్రమాదకరమైన రసాయనాలు కలిగిన మైనాన్ని ఆపిల్స్ పై ఉపయోగిస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. దీని వినియోగం కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.


వ్యాక్స్డ్ యాపిల్స్‌ను ఎలా గుర్తించాలి?

వేడి నీటితో శుభ్రం చేసుకోండి

మార్కెట్ నుండి ఆపిల్ కొనుగోలు చేసిన తర్వాత వాటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. వేడి చేసిన నీటిలో ఆపిల్స్ వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. ఆపిల్ ఉపరితలంపై ఏదైనా జిడ్డు లేదా మైనపు లాంటి పొర రావడం ప్రారంభిస్తే అది వ్యాక్స్ చేసినదని అర్థం చేసుకోండి.

కత్తితో స్క్రాప్ చేయండి

మార్కెట్ నుంచి ఆపిల్ కొన్న తర్వాత దానిని కత్తితో తేలికగా గీకడం ద్వారా దాన్ని తనిఖీ చేయవచ్చు. దాని నుండి ఏదైనా తెల్లటి పొర రాలిపోతే అది మైనపుతో పూత పూసినదని అర్థం.


మెరిసే ఆపిల్స్ కొనకండి

ఆపిల్ కొనేటపుడు ఎల్లప్పుడూ దాని మెరుపును చూడండి. ఆపిల్ చాలా మెరుస్తూ ఉంటే కచ్చితంగా దానిపై రసాయన రంగు వేసి ఉంటుంది. కొన్నిసార్లు తెల్లటి మైనం కారణంగా ఆపిల్ మెరుపు పెరుగుతుంది. నిజానికి సహజ ఆపిల్ మెరుపు తేలికపాటి రంగులో ఉంటుంది.

వాసన ద్వారా నకిలీ పండ్లను గుర్తించండి

సహజ ఆపిల్‌లు తీపి వాసనను కలిగి ఉంటాయి. కానీ రసాయన పండ్లలో ఆ వాసన ఉండదు. అలాగని అసహ్యకరమైన వాసనా రాదు. అందువల్ల ఆపిల్‌ను కొనుగోలు చేసే ముందు దానిని తేలికగా వాసన చూడండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:

ఈ 5 ఆహారాలు 'యాసిడ్' కంటే తక్కువ కాదు.. రోజూ తింటే లివర్ క్యాన్సర్..!

2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..

Read Latest and Health News

Updated Date - Jul 31 , 2025 | 05:52 PM