Share News

Mindfulness: 2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..

ABN , Publish Date - Jul 31 , 2025 | 02:50 PM

Mindfulness: నిశ్శబ్దం కారణంగా ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయని, బంధాలు మెరుగుపడతాయని, ఒత్తడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని 2013లో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. నిశ్శబ్దంగా ఉండటం వల్ల మెదడు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

Mindfulness: 2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..
Mindfulness

నిశ్శబ్దానికి ఉన్న శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనసుకు, మనిషికి ప్రశాంతత ఇచ్చేది కేవలం నిశ్శబ్దం మాత్రమే. అయితే, సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత నిశ్శబ్దం అంటే ఓ భయంకరమైన విషయంగా మారిపోయింది. ఒక పది నిమిషాలు ఫోన్ వాడకుండా.. నిశ్శబ్దంగా ఉంటే చచ్చిపోతామేమో అన్న స్థితికి జనం వచ్చేశారు. నిశ్శబ్దం అంటే చావుతో సమానంగా చూస్తున్నారు. గంటల పాటు ఫోన్లు వాడి బ్రెయిన్ పని తీరు బాగా దెబ్బ తింటోంది. పలు రకాల మానసిక, శారీరక రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.


సాధారణంగా బ్రెయిన్‌కు రెస్ట్ దొరికితే దానంతట అది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. కేవలం నిద్ర మాత్రమే కాదు.. నిశ్శబ్దం కూడా బ్రెయిన్‌ను రిపేర్ చేయగలుగుతుంది. ఓ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉన్నారంటే మీ బుర్రకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రతీ రోజూ కొంత సమయం పాటు నిశ్శబ్దంగా ఉంటే బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని న్యూరాలజీ డాక్టర్ పవన్ ఓయిజా అంటున్నారు. అంతేకాదు.. 2013లో ఇమ్కే కిర్‌స్టే, ఆయన సహచరులు నిశ్శబ్దంపై ఓ పరిశోధన చేశారు.


నిశ్శబ్దం కారణంగా ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయని, బంధాలు మెరుగుపడతాయని, ఒత్తడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని తేలింది. నిశ్శబ్దంగా ఉండటం వల్ల మెదడు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. మెదడులోని ముఖ్యమైన భాగం హిప్పోక్యాంపస్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. న్యూరోజెనిసిస్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. కొత్త న్యూరాన్ల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే.. వీలైనంత ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండి మీ బుర్రను కాపాడుకోండి. అప్పుడే మీరు కూడా బాగుంటారు.


ఇవి కూడా చదవండి

ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్లకు ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

Updated Date - Jul 31 , 2025 | 02:59 PM