Share News

She Finally Said Yes: ఏడేళ్లలో 42 సార్లు రిజెక్ట్ చేసింది.. 43వ సారి మాత్రం..

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:29 PM

She Finally Said Yes: 2018 నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు అతడు 42 సార్లు ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పింది. అతడిలో ప్రేమ, ఓపిక చావలేదు.

She Finally Said Yes: ఏడేళ్లలో 42 సార్లు రిజెక్ట్ చేసింది.. 43వ సారి మాత్రం..
She Finally Said Yes

ప్రేమించటం ఒక ఎత్తయితే.. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లటం మరో ఎత్తు. చాలా వరకు ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోతుంటాయి. చాలా ప్రేమ జంటలు ఇంట్లో ఒప్పించుకునే ధైర్యం లేక.. ఏళ్ల తరబడి వెయిట్ చేయలేక విడిపోతూ ఉంటాయి. వేరే పెళ్లి చేసుకుంటూ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ఓ ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి, ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఏకంగా ఏడేళ్ల పాటు ఎదురు చూశాడు. 42 సార్లు ఆమె కాదన్నా ఎంతో ఓపిక పట్టి విజయం సాధించాడు.


ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 38 ఏళ్ల సారాకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు 36 ఏళ్ల ల్యూక్ విన్‌ట్రిప్‌తో పరిచయం అయింది. ఆరు నెలలు రిలేషన్‌లో ఉన్న తర్వాత తనను పెళ్లి చేసుకోమని ల్యూక్.. సారాను అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా పెళ్లంటే ఆమెకు భయం ఏర్పడింది.


2018 నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు అతడు 42 సార్లు ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పింది. అతడిలో ప్రేమ, ఓపిక చావలేదు. మే నెలలో 43వ సారి ప్రయత్నించాడు. ఈ సారి ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ల్యూకో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మే 17వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సారా మాట్లాడుతూ.. ‘నేను అతడ్ని ప్రేమించాను. కానీ, పెళ్లికి మాత్రం ఎస్ చెప్పలేకపోయాను. పిల్లల విషయంలో అంతా ఓకేనా కాదా? అని నేను తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే నో చెప్పా. అతడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా పెళ్లి ప్రపోజల్ తెస్తూనే ఉన్నాడు’ అని అంది.


ఇవి కూడా చదవండి

2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..

పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా

Updated Date - Jul 31 , 2025 | 03:33 PM