Share News

Liver Damaging Foods: ఈ 5 ఆహారాలు 'యాసిడ్' కంటే తక్కువ కాదు.. రోజూ తింటే లివర్ క్యాన్సర్..!

ABN , Publish Date - Jul 31 , 2025 | 02:18 PM

మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ 5 ఆహారాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Liver Damaging Foods: ఈ 5 ఆహారాలు 'యాసిడ్' కంటే తక్కువ కాదు.. రోజూ తింటే లివర్ క్యాన్సర్..!
Foods that Cause Liver Cancer

Foods that Cause Liver Cancer: కాలేయం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. కాలేయం మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది విషకారకాలను తొలగించేందుకు, గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాల నిల్వలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. పోషకాలను ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండటానికి కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకుకోవడం చాలా ముఖ్యం.


ఫ్యాటీ లివర్ సమస్య సర్వసాధారణమైన తర్వాత లివర్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయ్. రాబోయే 20-25 సంవత్సరాలలో లివర్ క్యాన్సర్ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం , ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మందికి పైగా ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు లివర్ క్యాన్సర్ కూడా ఒక ప్రధాన కారణం. దీని వలన ప్రతి సంవత్సరం 7,00,000 కంటే ఎక్కువ మంది మరణిస్తారు.


అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారంలో అజాగ్రత్తలు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో, ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి అనేక కాలేయ సంబంధిత సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలేయ క్యాన్సర్‌కు అత్యంత సాధారణ కారణం హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్. కానీ కొన్ని జీవనశైలి కారణాల వల్ల కొందరు ఈ వ్యాధికి కూడా బలైపోవచ్చు. ముఖ్యంగా ఈ 5 ఆహారాలు కాలేయానికి యాసిడ్ కంటే తక్కువ కాదు. వీటిని రోజూ తింటే క్యాన్సర్ కణాలు శరీరంలో శరవేగంగా వృద్ధి చెందుతాయి.


ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మొత్తంలో ఇనుము, సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీని కారణంగా క్యాన్సర్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌తో నేరుగా ముడిపడి ఉంటుంది.

మద్యం

ఆల్కహాల్ కాలేయానికి విషంలాంటిది. దీనిని పరిమితం చేయాలి లేదా పూర్తిగా నివారించాలి నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయంలో క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మొదట ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమై క్రమంగా క్యాన్సర్ సమస్యగా మారుతుంది.

చక్కెర

చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ మాత్రమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి లేనప్పటికీ.. ఏ రూపంలోనైనా ఎక్కువ చక్కెర తినడం వల్ల సెల్యులార్ నష్టం జరుగుతుంది. ఇది కాలేయ క్యాన్సర్ కు దారితీయవచ్చు.


జంక్ ఫుడ్స్

జంక్ ఫుడ్స్ రోజూ తీసుకోవడం కాలేయానికి హానికరం. ఇది నాన్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి సిర్రోసిస్, ఇంకా క్యాన్సర్‌కు కారణమవ్వచ్చు.

అధిక ఉప్పు

అధిక ఉప్పు కాలేయ వాపు తీవ్రతరం చేస్తుంది. ప్రాసెస్ ఫుడ్స్, ఊరగాయలు, ఫాస్ట్ ఫుడ్స్ లో ఉపయోగించే టేస్టీ సాల్ట్ తరచుగా తింటూ పోతే లివర్ సమస్యలు వస్తాయి. అలాగే ధూమపానం, రెడ్ మీట్ కూడా లివర్ క్యాన్సర్ కు కారణవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:

న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం

తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Read Latest and Health News

Updated Date - Jul 31 , 2025 | 03:29 PM