Jubilee Hills: నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:13 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
హైదరాబాద్, నవంబరు9(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం (Jubilee Hills By Election Campaign) ఈరోజు (ఆదివారం)తో ముగియనుంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మూగబోనున్నాయి మైకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన, 14వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది.
హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం సాగింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్డుషో లు, ర్యాలీలకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతలు ప్లాన్ చేసుకున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారం ఆపనున్నాయి పార్టీలు. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నికల ప్రచారంలో టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బాకీ కార్డుల పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గులాబీ నేతలు.
కారు పార్టీ తరపున ప్రచారంలో అన్నీ తానై వ్యవహారించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు డివిజన్లలో రోడ్డు షోలు నిర్వహించారు కేటీఆర్. సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కూడా అధికార కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇటీవల హరీశ్‌రావు తండ్రి చనిపోయారు. ఈ నేపథ్యంలో పితృవియోగంతో పదిరోజుల పాటు హరీశ్‌రావు ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కొంత దూరంగా ఉన్నారు. అయితే, నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు హరీశ్‌రావు. ఇవాళ మోతీనగర్‌లో ప్రచారం చేయనున్నారు హరీశ్‌రావు. నేడు బైక్ ర్యాలీతో ప్రచారాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ముగించనున్నారు.
గెలుపుపై ధీమాగా కాంగ్రెస్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని గెలిపిస్తే తన కుడి భుజంగా ఉంటారని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుపై ధీమాగా కాంగ్రెస్ ఉంది. 30 వేల మెజార్టీ వస్తుందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ తీసుకున్నారు. అయితే, తనపై, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గెలుపుతో సమాధానం చెప్పాలని భావిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News