ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:13 AM
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.

టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు pb.icf.gov.in ద్వారా ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 1,000 కంటే ఎక్కువ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 11, 2025.
మొత్తం పోస్టుల సంఖ్య
రైల్వే రంగంలో పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులకు ఈ నియామకం ఒక సువర్ణావకాశం. మొత్తం 1,010 అప్రెంటిస్ పోస్టులను ఈ నియాకం కింద భర్తీ చేస్తారు. అర్హత ఆధారంగా అర్హులైన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అర్హత ప్రమాణాలు
ఈ నియామకం ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థుల కోసం. వివరణాత్మక విద్యార్హతలను ఐసీఎఫ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
దరఖాస్తుదారుల వయసు 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ముఖ్యంగా, అభ్యర్థుల వయసు నిర్దేశించిన తేదీ నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనలు కొన్ని వర్గాలకు వర్తిస్తాయి. కానీ నోటిఫికేషన్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదు.
ఎంపిక ప్రక్రియ
10వ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. అయితే, కొవిడ్ సమయంలో టెన్త్ పాసైన అభ్యర్థుల విషయంలో వారి పాఠశాల ప్రిన్సిపల్ సంతకం చేసిన 9వ తరగతి మార్కుల పత్రం / 10వ తరగతి అర్ధవార్షిక మార్కుల పత్రం రుజువును మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకుంటారు.
ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఉంటే, ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే 10వ తరగతి పరీక్షలో ముందుగా ఉత్తీర్ణులైన అభ్యర్థి పేరును పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు రుసుము
దరఖాస్తుదారులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు రూ.100 + వర్తించే సేవా ఛార్జీలు చెల్లించాలి.
SC/ST/PWD/మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రక్రియ
ముందుగా అధికారిక వెబ్‌సైట్ pb.icf.gov.in ని సందర్శించి రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
పేరు, ఇమెయిల్, సంప్రదించాల్సిన సమాచారం వంటి ప్రాథమిక సమాచారాన్ని అందించి అకౌంట్ క్రియేట్ చేయండి.
లాగిన్ అయి మీ విద్యార్హతతో సహా ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారం పూర్తి చేయండి.
అవసరమైన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు (SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు మినహాయింపు) చెల్లించండి.
వివరాలను తనిఖీ చేసి ఫారం సబ్మిట్ చేయండి. రికార్డుల కోసం ఒక కాపీని సేవ్ చేసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు
బీఎస్ఎఫ్ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టులకు
For More Educational News And Telugu News