Share News

Thailand and Cambodia: టెంపుల్‌ వార్‌ విరమణకు సిద్ధం

ABN , Publish Date - Jul 28 , 2025 | 06:26 AM

పురాతన శివాలయాలు ఉన్న ప్రాంతం కోసం మొదలుపెట్టిన యుద్ధాన్ని విరమించేందుకు థాయ్‌లాండ్‌, కాంబోడియా సిద్ధమయ్యాయి.

Thailand and Cambodia: టెంపుల్‌ వార్‌ విరమణకు సిద్ధం

  • నేడు మలేషియాలో థాయ్‌, కాంబోడియా నేతల చర్చలు

బ్యాంకాక్‌, జూలై 27: పురాతన శివాలయాలు ఉన్న ప్రాంతం కోసం మొదలుపెట్టిన యుద్ధాన్ని విరమించేందుకు థాయ్‌లాండ్‌, కాంబోడియా సిద్ధమయ్యాయి. మలేషియాలో ఇరు దేశాల ప్రతినిధులు సోమవారం చర్చలు జరపనున్నారు. ఆదివారం తెల్లవారుజామునే థాయ్‌, కాంబోడియా ప్రధానులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడారు. యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలు జరపబోమని స్పష్టం చేశానని, దీంతో ఆ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయినా ఇరుదేశాల మధ్య సరిహద్దుల వెంట పరస్పర దాడులు కొనసాగాయి. కానీ మలేషియా మధ్యవర్తిత్వంతో చర్చలకు సిద్ధమయ్యాయి. థాయ్‌లాండ్‌, కాంబోడియా సరిహద్దుల్లో ఉన్న పురాతన ‘టా మ్యుయెన్‌’ శివాలయాల సమూహం, ప్రీహ్‌ విహార్‌ ఆలయ ప్రాంతం విషయంలో ఇరుదేశాల మధ్య ఈ నెల 24న యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.

Updated Date - Jul 28 , 2025 | 06:26 AM