Share News

Acidity Drug Investigation: రానిటిడిన్‌తో క్యాన్సర్‌ భయం

ABN , Publish Date - Jul 28 , 2025 | 06:30 AM

ఎసిడిటీ చికిత్సకు ఉపయోగించే ఔషధం రానిటిడిన్‌తో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Acidity Drug Investigation: రానిటిడిన్‌తో క్యాన్సర్‌ భయం

  • ఎసిడిటీ మందుపై కేంద్రం విచారణ

న్యూఢిల్లీ, జూలై 27: ఎసిడిటీ చికిత్సకు ఉపయోగించే ఔషధం రానిటిడిన్‌తో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఔషధంలోని నైట్రోసోడైమెథైలమైన్‌(ఎన్‌డీఎంఏ) అనే ప్రమాదకరమైన క్యాన్సర్‌ కారకం(కార్సినోజెన్‌) ఉన్నట్లు తేలింది. దీంతో.. తమ పరిధిలో తయారయ్యే రానిటిడిన్‌లో ఎన్‌డీఎంఏ స్థాయులను గమనించాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎ్‌ససీవో), అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ డైరెక్టర్‌ జనరళ్లకు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశి సూచనతో.. డ్రగ్స్‌, టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ) సిఫార్సుల ఆధారంగా రానిటిడిన్‌లో క్యాన్సర్‌ కారకాలున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

Updated Date - Jul 28 , 2025 | 06:30 AM