Share News

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

ABN , Publish Date - Jul 28 , 2025 | 07:20 AM

రైల్లో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించిన ఓ మహిళ తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. భారత్‌ ఇంతగా పురోగమించిందంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఆమె కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్
Solo Woman Travel India Train

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే అంటే చాలా మందికి రద్దీ, అపరిశుభ్రత, రాకపోకల్లో ఆలస్యం వంటివి గుర్తొస్తాయి. అయితే, రైలు జర్నీలో సానుకూల అంశాల గురించి చెబుతూ ఓ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఒంటరి ప్రయాణాల గురించి ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

లింక్డ్‌ఇన్‌లో పూర్వీ జైన్ అనే మహిళ ఈ పోస్టు షేర్ చేశారు. ముంబై నుంచి సూరత్ వరకూ రాత్రి వేళ రైల్లో ఒంటరిగా తాను జర్నీ చేశానని అన్నారు. ‘ఒక దేశంగా మనం ఎంత పురోగతి సాధించామో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. రాత్రి జర్నీలో ఇద్దరు మహిళా పోలీసులు తరచూ వచ్చి నా బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారే నా సీటు వద్దకు వచ్చి మీరూ పూర్వీనా అని అడగడం ఆశ్చర్యం వేసింది. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా అని కూడా అడిగారు’

‘ఓ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆ నెంబర్‌కు కాల్ చేయమని సలహా ఇచ్చారు. నేను ఒంటరిగా జర్నీ చేస్తున్నానని తెలిసి వారు జాగ్రత్త కోసం నా వద్దకు వచ్చినట్టు ఆ తరువాత తెలిసింది. నా పక్క సీటులోని వృద్ధ జంట కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. తమ మనవరాలు కూడా ఒంటరిగా ప్రయాణిస్తుంటుందని, ఇదంతా చూస్తుంటే తమకు కొంత టెన్షన్ తగ్గిందని చెప్పారు’


‘ఈ అనుభవం నన్ను భారతీయ రైల్వే స్థితిగతులను సమీక్షించుకునేలా చేసింది. భారత్ కూడా చాలా వరకూ పురోగతి సాధించింది. వందే భారత్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, వేగవంతమైన తత్కాల్ వెరిఫికేషన్.. ఇలా ప్రయాణాలు నేటి జమానాలో ఎంతో సులువుగా మారిపోయాయి’ అని అన్నారు. మన దేశంలో అంతా సవ్యంగా ఉండకపోవచ్చు గానీ ఈ చిన్న చిన్న మార్పులే దేశంపై సానుకూల దృక్పథం కలుగజేస్తున్నాయని తెలిపారు. మెల్లగా ఒక్కో అడుగు వేస్తున్నప్పటికీ అభివృద్ధి దిశగా ప్రయాణం సాగుతోందని అన్నారు.

ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భద్రతా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నందుకు రైల్వేపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. మహిళలు ఒంటరి ప్రయాణాలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఇటీవల ఎదురైందని మరో మహిళ చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం

Read Latest and Viral News

Updated Date - Jul 28 , 2025 | 07:28 AM