AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
ABN , Publish Date - May 31 , 2025 | 02:40 PM
AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP Mega DSC Schedule 2025: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC) పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష 2025 హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం ఏపీ విద్యాశాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను సన్నద్ధం చేస్తున్నారు. రిజిస్టర్డ్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుంచి వారి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు అప్ డేట్ల కోసం వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ సకాలంలో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్ ఎలా నిర్మించుకోవాలి?
మరిన్ని ఎడ్యుకేషన్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి