Instagram Teen Accounts : పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్..ఇకపై పేరెంట్స్ కంట్రోల్ చేయవచ్చు.. యాక్టివేట్ కోసం..
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:50 PM
How To Activate Insta Teen Accounts : ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో తల్లిదండ్రులు ఇక నుంచి తమ పిల్లల ఖాతాలపై ఒక కన్నేసి ఉంచవచ్చు. మొత్తంగా తమ పిల్లలు ఇన్‌స్టా అకౌంట్లో ఏం చేస్తున్నారనేది నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉంచే ఈ ఫీచర్ యాక్టివేషన్ కోసం ఇలా చేయండి..

Instagram Teen Accounts : నడవడం మొదలుపెట్టీపెట్టగానే అరచేతిలో ఫోన్ ఉండాల్సిందే అంటున్నారు నేటి తరం పిల్లలు. స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ ఇన్‌స్టా అకౌంట్ ఉండటం అనేది ప్రస్తుతం కాలంలో సర్వసాధారణ విషయం. ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ చేతిలో పట్టుకుని రీల్స్ స్క్రోల్ చేయడం లేదా క్రియేట్ చేయడం ఇప్పటి పిల్లల అలవాటు. పెద్దలు వారి పనిలో వారుంటే చడీ చప్పుడూ లేకుండా ఒకే చోట కూర్చుని గంటల తరబడి అలా సోషల్ మీడియా మేనియాలో కొట్టుకుపోతుంటారు. ఎలాంటి కంటెంట్ వీక్షిస్తున్నారు? ఎవరితో కమ్యునికేట్ అవుతున్నారు? అనేది అందరు తల్లిదండ్రులకి తెలుసుకోవడం సాధ్యంకాదు. ఇది దృష్టిలో ఉంచుకుని పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్‌లను ప్రారంభించింది. మరి, ఈ ఫీచర్ ఏంటి ? పేరెంట్స్ పిల్లల అకౌంట్స్ కంట్రోల్ చేసేందుకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
టీన్ అకౌంట్స్ అంటే ఏమిటి ?
మెటా ప్రవేశపెట్టిన ఈ టీన్ అకౌంట్స్ ఫీచర్ 16 ఏళ్లలోపు టీనేజర్లకు భద్రతా సెట్టింగ్‌లను వర్తింపజేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో వారి పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పేరెంట్స్‌కు కొన్ని ప్రత్యేక టూల్స్ అందిస్తుంది. ఫాలో అవుతున్న ఖాతాల పోస్టులు మాత్రమే వీక్షించగలరు. ట్యాగ్ చేయగలరు. ఫాలో/ కనెక్ట్ అయిన ఖాతాలతోనే కాంటాక్స్ కాగలిగేలా మెసేట్ సెట్టింగ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశాకే ఏ కొత్త ఖాతానైనా ఫాలో చేయగలరు. సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉండటం వల్ల అసభ్యకరమైన, హానికరమైన కంటెంట్, కామెంట్స్ ఇలాంటి ఖాతాల్లో నిషేధం. ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడితే పేరెంట్స్‌కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఆటోమేటిగ్గా స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లు మ్యూట్ అయిపోతాయి.
పిల్లల ఇన్‌స్టా ఖాతాను ఇలా కంట్రోల్ చేయాలి?
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల ఖాతాలు కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా వారికీ ఇన్‌స్టాలో ఖాతా ఉండితీరాలి. తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే వ్యక్తిగత ఖాతా ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న Settings and activityలోని Family center ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పిల్లల ఖాతాను ఎంచుకోగానే వారి అకౌంట్‌కు రిక్వెస్ట్ వెళుతుంది. వారు యాక్సెప్ట్ చేశాకే ఖాతా పేరెంట్స్ కంట్రోల్లోకి వస్తుంది. వారు ఇతరులకు ఏం మెసేజ్ చేశారనేది చదవలేరు. కానీ, వారం రోజుల ముందు వరకూ మీ పిల్లలు ఎవరెవరితో ఛాట్ చేశారనే సంగతి తెలుస్తుంది. టైమ్ లిమిట్, స్లీప్ మోడ్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకునే సదుపాయం ఉంది.
పేరెంట్స్ అనుమతి లేకపోతే ఇవి చేయలేరు..
తల్లిదండ్రులు ఓకే చెయ్యకుపండా పిల్లలు తమ ఖాతాను ప్రైవేటు అకౌంట్‌గా మార్చుకోలేరు. ఒకవేళ Account Privacyపై క్లిక్ చేసినా ఆల్రెడీ Private Account ఆప్షన్ ఎనేబుల్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. డిజేబుల్ చేయాలని ట్రై చేస్తే పేరెంట్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. Add Parent ఆప్షన్ పైనా క్లిక్ చేసి తర్వాత Continue ఎంచుకోవాలి. అప్పుడు పేరెంట్స్‌కు మీ రిక్వెస్ట్ వెళుతుంది. వారు ఓకే చేస్తేనే టీన్ అకౌంట్ నుంచి పబ్లిక్ అకౌంట్‌గా ఛేంజ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..