Share News

BSNL New Offers: BSNL హోలీ గిఫ్ట్.. 365 రోజుల ఫ్రీ కాల్స్.. ఫ్రీ డేటా కూడా.. ధర ఎంతంటే?

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:30 AM

BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్‌ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్‌తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..

BSNL New Offers: BSNL  హోలీ గిఫ్ట్.. 365 రోజుల ఫ్రీ కాల్స్.. ఫ్రీ డేటా కూడా.. ధర ఎంతంటే?
BSNL Holy Recharge Offers

BSNL Holy Offer: BSNL వినియోగదారులకు శుభవార్త. హోలీ సందర్భంగా వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లకు అదనపు వాలిడిటీని కూడా అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తన అధికారిక "X" ఖాతాలో ఈ సమాచారం వెల్లడించింది. వినియోగదారులు ఈ ఆఫర్‌ను మార్చి 1 నుండి మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు.


365 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్.. ఫ్రీ డేటా..

ఈ హోలీ ఆఫర్‌లో ప్రధానంగా రూ.1,499 ప్లాన్‌కు అదనపు వాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 336 రోజుల పాటు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు హోలీ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా మొత్తం 365 రోజుల పాటు వాలిడిటీ పొందవచ్చు. దీని ద్వారా యూజర్లు ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, ప్రతి రోజు 100 SMS, 24GB వరకు హై-స్పీడ్ డేటా పొందే అవకాశం ఉంది. డేటా మొత్తం అయిపోయిన తర్వాత కూడా 40kbps స్పీడ్‌తో అదనపు డేటా వాడుకునే అవకాశం ఉంటుంది.


425రోజుల ప్లాన్.. డైలీ 2జీబీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్

ఇంకా ఎక్కువ ప్రయోజనాల కోసం BSNL రూ.2,399 ప్లాన్‌కూ అదనపు వాలిడిటీ అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉండేది. కానీ హోలీ ఆఫర్ కింద 425 రోజుల వరకు పొడిగించారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, అలాగే Delhi, Mumbai ప్రాంతాల్లో MTNL నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా, BSNL వినియోగదారులకు BiTV ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, కొన్ని OTT యాప్‌ల యాక్సెస్ కూడా అందిస్తోంది.


BSNL వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్లు వార్షిక రీఛార్జ్ చేసే వారికి పెద్ద ప్రయోజనం కలిగించేలా ఉన్నాయి. హోలీ సందర్భంగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు మార్చి 31లోగా తమ సబ్‌స్క్రిప్షన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.


Read Also : BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Gold rates today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

HPCL Chairmanఫ హెచ్‌పీసీఎల్‌ సారథిగా వికాస్‌ కౌశల్‌

Updated Date - Mar 08 , 2025 | 11:35 AM