Share News

Minister Payyavula Keshav: మద్యం స్కాంలో జగన్ వేలకోట్లు దాచుకున్నారు: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:58 PM

ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌‌లు ఏర్పాటుచేసి జగన్ అండ్ కో వేలకోట్లు దాచుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ. 3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.

Minister Payyavula Keshav: మద్యం స్కాంలో జగన్ వేలకోట్లు దాచుకున్నారు: మంత్రి పయ్యావుల
Minister Payyavula Keshav

తూర్పుగోదావరిజిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో మద్యం పేరుతో సామాన్య ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) చాగల్లు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు గ్రామసభలో మంత్రి పయ్యావుల కేశవ్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మద్యం స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ సక్రమమేనని.. అక్రమం కాదని స్పష్టం చేశారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌‌లు ఏర్పాటుచేసి వేలకోట్లు జగన్ అండ్ కో దాచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ.3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ స్కామ్ చాలా పెద్దదని ఆరోపించారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఇసుక స్కామ్‌లో ఎంత అవినీతికి పాల్పడ్డారనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను జగన్ రెడ్డి చెడగొడితే.. ఇప్పుడు చంద్రబాబునాయుడు నిలబెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 07:04 PM