Minister Nimmala Ramanaidu: మరో రెండు పథకాలకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:06 AM
ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో విస్తృతమైన సంక్షేమ అజెండాను ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో రెండు పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రెండు పథకాల గురించి కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ప్రకటించారు. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
ఇవాళ(బుధవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పాలకొల్లు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వివరిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు తమది మంచి ప్రభుత్వమని చెబుతున్నారని పేర్కొన్నారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.
కూటమి పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని, ప్రగతిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాల్జేశారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా.. జగన్ ఐదేళ్ల పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం
రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
For More AP News and Telugu News