Ramdev Baba: దేశంలోనే నెంబర్‌వన్ సీఎం చంద్రబాబు: రాందేవ్ బాబా
ABN , Publish Date - Jun 26 , 2025 | 10:12 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను ప్రపంచ పటంలో చంద్రబాబు నిలిపారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ, ప్రకృతి అందాలకు కొదవలేదని ఉద్గాటించారు. అరకులోయ అందాలు ప్రపంచానికే తలమానికమని రాందేవ్ బాబా పేర్కొన్నారు.

అల్లూరి జిల్లా: దేశంలోనే నెంబర్‌వన్ సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Yoga Guru Ramdev Baba) ప్రశంసించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఇవాళ(గురువారం) రాందేవ్ బాబా అల్లూరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సే నో గంజా పోస్టర్‌ని అల్లూరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో రాందేవ్ బాబా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను ప్రపంచ పటంలో చంద్రబాబు నిలిపారని రాందేవ్ బాబా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ, ప్రకృతి అందాలకు కొదవలేదని ఉద్గాటించారు. అరకులోయ అందాలు ప్రపంచానికే తలమానికమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు తనకు చెప్పారని గుర్తుచేశారు. ‘నషా ముక్త భారత్ అధ్యాయన్’ను యావత్ భారతదేశ యువతకు తాను అరకులోయ నుంచి పిలుపునిస్తున్నానని అన్నారు. గంజాయిని విడిచి యువత అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. ఆరోగ్యంగా దృఢంగా దేశాన్ని ముందుకు నడిపించే విధంగా యువత తయారవ్వాలని రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయితో జీవితాలను పాడు చేసుకోవద్దని రాందేవ్ బాబా కోరారు.
ఇవి కూడా చదవండి:
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News