Teamwork... Increase admissions రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవేశాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి కేవలం 13 మంది విద్యార్థినులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 265కు పెరిగింది.
There are schools... but no children! పాఠశాలకు పక్కా భవనం, తరగతి గదులు, విశాలమైన మైదానం, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం ఉండగా విద్యార్థులు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ముగ్గురు ఉన్నారు. ఇలా ఒకటి రెండు పాఠశాలలు కాదు. కొత్తవలస మండలంలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపే.
this is farmer welfare government రైతులకు మంచి రోజులు వచ్చాయని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లాలోని 2.27లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎంకిసాన్ పథకాల కింద రూ.152.45కోట్లను ఆమె శనివారం విడుదల చేశారు.
good days for Gandhi Park ’అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకిచ్చిన మరో హామీ అమలుకు నోచుకుంది. విజయనగరంలోని గాంధీపార్కు అభివృద్ధికి రూ.35లక్షల85వేలను విశాఖ మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కేటాయించింది.
తెలుగు రంగానికి విశేష సేవలు అందించి. నాటక రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు బళ్లారి రాఘవ అని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు.
రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుం దని ఎమ్మెల్యేలు అన్నారు.
సాలూరు మీదుగా మల్కనగిరి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న పలువురిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
పరిశ్రమల పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడం సబబుకాదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.
: పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు శ్రేయస్కరమని ఐసీడీఎస్ సీడీపీవో రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం మండలంలోని పెదభోగిలి పంచాయతీ పరిధిలోని అప్పయ్యపేట, సీతానగరం, బుడ్డిపేట అంగన్‌వాడీ కేంద్రాల గర్భిణులకు అవగాహన సదస్సు అప్పయ్యపేటలో సర్పంచ్ జె.తేరేజమ్మ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పూర్ణిమ పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం చెక్కుల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు.