Home » Alluri Seetharamaraju
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.
అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.
ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాయి పల్లవి(6), తల్లి గాయత్రి (28) మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు నిర్వహించిన రాబిన్‌హుడ్ అల్లూరి సీతారామరాజు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు.