Maoists Protest Day: మావోయిస్టుల నిరసన.. పోలీసులు హై అలర్ట్
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:19 AM
అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
అల్లూరిజిల్లా పాడేరు,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు(ఆదివారం) నిరసన దినం పాటించాలని మావోయిస్టులు (Maoists)పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈరోజు మావోయిస్టు నిరసన దినం సందర్భంగా అల్లూరి జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.
మరోవైపు, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ముందస్తుగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిపివేశారు. పాడేరు డిపో నుంచి వివిధ సర్వీసులను కుదించారు. నైట్ హాల్ట్ బస్సులను మండల కేంద్రాలకే పరిమితం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ఉచిత బస్సును అవుట్ పోస్టు వరకే నడిపేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో భద్రాచలం, రంపచోడవరం సర్వీసులు రద్దు చేసినట్లు అల్లూరి జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News