Maredumilli Encounter: పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:09 AM
రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
అల్లూరి జిల్లా, నవంబర్ 21: జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల వరుసగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే రెండు ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఇంకా తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
పోస్టుమార్టం ఆలస్యం కావడంతో ఆసుపత్రిలోనే బంధువులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. 13 మంది మృతదేహాల్లో ఇప్పటి వరకు నలుగురికి మాత్రమే పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హిడ్మా దంపతులు, టెక్ శంకర్, దేవే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి స్వస్థలాలకు తరలించారు. అలాగే నిన్న టెక్ శంకర్ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. టెక్ శంకర్ మినహా 12 మంది మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కావడంతో అక్కడి నుంచి బంధువులు రంపచోడవరం ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద
సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్
Read Latest AP News And Telugu News