Tomato price: టమోటా @50.. భారీగా పెరిగిన ధర
ABN , Publish Date - Nov 21 , 2025 | 08:23 AM
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర భారీగా పెరిగింది.
అనంతపురం: కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర(Tomato price) భారీగా పెరిగింది. కిలో ధర ఏకంగా రూ.50కి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్‌లో టమోటాకు డిమాండ్ పెరిగింది. ఆశించిన స్థాయిలో మార్కెట్‌లో కాయలు లేకపోవడం, ఎగుమతి ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉండడం ధర పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గురువారం గరిష్టంగా కిలో రూ.50తో అమ్ముడుపోయాయి. కనిష్ఠంగా రూ.27, సరాసరి రూ.37తో విక్రయాలు జరిగినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్(Rapthadu Market Yard Secretary Roopkumar) తెలిపారు. మార్కెట్‌కు మొత్తంగా 1,875 టన్నుల కాయలు వచ్చాయన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News