Share News

AP NEWS: ఏపీలో విషాదకర ఘటన.. ఏమైందంటే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:03 PM

అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాయి పల్లవి(6), తల్లి గాయత్రి (28) మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

AP NEWS: ఏపీలో విషాదకర ఘటన.. ఏమైందంటే..
Tragic incident in Alluri District

అల్లూరి జిల్లా: రంపచోడవరం (Rampachodavaram) మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్‌తో (Fire Incident) ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాయి పల్లవి(6), తల్లి గాయత్రి (28) మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇంట్లో సాయి పల్లవిని వదిలేసి తల్లి గాయత్రి పనుల్లో మునిగిపోయింది. ఈ సమయంలో టీవీ చూస్తూ సాయి పల్లవి పడుకుండిపోయారు. అయితే, ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.


అగ్నిప్రమాదానికి గురైన కూతురిని కాపాడుకునే సమయంలో మంటల్లో తల్లికూతుళ్లు చిక్కుకున్నారు. మంటల్లో కాలిపోయిన తల్లి కూతుళ్లను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తల్లీబిడ్డ మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అనంతపురం జిల్లాలో ఇద్దరు బాలికలు మృతి..

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామంలో దోన గంగమ్మ కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతిచెందారు. వారిని మౌనిక (9), శ్వేత (14)గా గుర్తించారు. శ్వేత తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లారు. అయితే ఓ విషయంలో తన తల్లిదండ్రులు కొడతారనే భయంతో ఆత్మహత్యకు శ్వేత పాల్పడింది. అయితే, దోన గంగమ్మ కుంటలో పడి తాను చనిపోతానని తన చెల్లెళ్లకు చెప్పి తనతో పాటు వెళ్తూ తన స్నేహితురాలు మౌనికను కూడా శ్వేత తోడు తీసుకెళ్లింది. ఈ విషయం శ్వేత తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే దోన గంగమ్మ కుంటలో గాలించగా ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి. అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అన్నమయ్య జిల్లాలో ముగ్గురు యువకులు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు మండలం, పెద్దపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మృతులు ములకలచెరువు మండలం వేపూరి కోట పంచాయతీలోని కూటగులోల్లపల్లికి చెందిన వెంకటేష్, తరుణ్, మనోజ్‌లుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 03 , 2025 | 09:38 PM