MP Kalisetty Appalanaidu: ఢిల్లీలో టీడీపీ కార్యాలయం.. ఎంపీ కలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:30 PM
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetty Appalanaidu) వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో టీడీపీ కార్యాలయం ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సూచించారని అన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాలా ఖట్టర్‌ను కలిశామని.. ఢిల్లీలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరామని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ కార్యాలయం కోసం స్థల పరిశీలన జరిగిందని గుర్తుచేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఇవాళ(మంగళవారం, జులై22) ఢిల్లీ వేదికగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పంట బీమా క్లెయిమ్‌లో.. అత్యధికంగా 40 శాతం మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని వివరించారు. మొత్తం రూ. 6,604 కోట్ల పెండింగ్ బీమా క్లెయిమ్స్‌లో.. ఆంధ్రప్రదేశ్ రైతులకే రూ.2,565 కోట్లు పెండింగ్‌లో ఉందని వెల్లడించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
2022 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 30 లక్షల మంది రైతులు బీమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా ప్రభావితం అయ్యిందని తెలిపారు. కర్నూల్ జిల్లాలో 4లక్షల మంది, అనంతపురంలో 3 లక్షలు, కడపలో 2 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2 లక్షల మంది రైతులు పంట నష్ట బీమా పరిహారాన్ని పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రబీ, ఖరీఫ్ పంటల సీజన్‌లో జగన్ ప్రభుత్వం రైతులని నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
For More AP News and Telugu News