Minister Anitha: మహిళలు ధైర్యంగా ఉండాలి.. హోమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:38 PM
Minister Anitha: ఒక వైపు ఉద్యోగం,మరోవైపు ఇంటిని చూసుకుంటూ విజయవంతంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అనిత చెప్పారు.

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఇవాళ (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్యసేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, అధికారులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నర్సులతో కలిసి హోం మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. మహిళలు ఎప్పుడు మహరాణులేనని చెప్పారు. రోగులను నర్సులు ఎప్పుడు అమ్మలా చూసుకుంటారని అన్నారు. మహిళలు లేకపోతే పురుషులు లేరని హోం మంత్రి అనిత చెప్పుకొచ్చారు.
మహిళ జీతం ఆశించకుండా తల్లిలాగా పని చేస్తుందన్నారు. గతంలో మహిళా సాధికారత కోసం మహిళలు పోరాటాలు చేశారని చెప్పారు. ప్రస్తుతం పురుషులు కన్నా మహిళలే ఎక్కువ అని తెలిపారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లలతో పాటు మగ పిల్లలను కూడా భధ్రతగా,బాధ్యతగా పెంచాలని హోం మంత్రి అనిత సూచించారు.
ఒక వైపు ఉద్యోగం, మరోవైపు ఇంటిని చూసుకుంటూ విజయవంతంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని హోం మంత్రి అనిత అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు. తమ తమ వృత్తుల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని అన్నారు. నర్సుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. కేజీహెచ్‌లో ప్రతీ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శక్తి యాప్‌ను మహిళలు వినియోగించుకోవాలని హోం మంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్
Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ
Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి
Read Latest AP News and Telugu News