Share News

Poorna Chandra Rao: ఆ భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారు.. మాజీ డీజీపీ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jul 27 , 2025 | 07:14 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏఐబీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ డీజీపీ పూర్ణ‌చంద్ర‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారని పూర్ణ‌చంద్ర‌రావు ఆరోపించారు.

 Poorna Chandra Rao: ఆ భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారు.. మాజీ డీజీపీ షాకింగ్ కామెంట్స్
Poorna Chandra Rao

విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏఐబీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ డీజీపీ జె. పూర్ణ‌చంద్ర‌రావు (Poorna Chandra Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(ఆదివారం) విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో పులివెందులకు చెందిన విశ్వేశ్వర రెడ్డికి ఈ భూములను జగన్ అప్పజెప్పారని విమర్శించారు పూర్ణ‌చంద్ర‌రావు.


జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పెద్ద స్కామ్ ఇదని పూర్ణ‌చంద్ర‌రావు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ భూములను విశ్వేశ్వరరెడ్డికే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ నెల్లూరులో కరేడు ప్రాంతానికి వెళ్తామంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పోలీసుల చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పూర్ణ‌చంద్ర‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 07:18 PM