Share News

Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:18 PM

Pawan Kalyan:సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. అల్లూరి జిల్లా ప్రజలకు అండగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులకు చెప్పులు లేని విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు వారికి చెప్పులు పంపించి తన గొప్ప మనస్సును పవన్ కల్యాణ్ చాటుకున్నారు.

Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉండే గ్రామం పెదపాడు. ఈ గ్రామంలో ఎంతో మంది గిరిజనులు నివసిస్తున్నారు. వారికి కనీసం పాదరక్షలు కూడా లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఈ గ్రామంలో పర్యటించారు. పవన్‌ను చూడటానికి ఆ గ్రామంలోని పాంగి మిత్తు అనే వృద్ధురాలు వచ్చింది. ఆమెకు కనీసం చెప్పులు లేకుండా తనను చూడటం కోసం రావడాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. వెంటనే పక్కనున్న ఉపాధి హామీ సిబ్బంది గురించి ఈ విషయంపై ఆరా తీశారు.


ఈ నెల 7వ తేదీన అల్లూరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా "అడవి తల్లిబాట" అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు ప్రాంతానికి చెందిన పాంగి మిత్తు అనే వృద్ధురాలు పవన్‌ను చూడటానికి వచ్చింది. అయితే ఆమె చెప్పులు లేకుండా ఉండటాన్ని చూసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు.


వెంటనే అక్కడున్న ఉపాధి హామీ సిబ్బందితో ఈ విషయం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. గిరిజనులకు వెంటనే చెప్పులను తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం వారితో మాట్లాడాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆ ఊరికి పంపించారు. గిరిజనులకు కావాల్సిన చెప్పుల సైజులు, ఎంతమందికి చెప్పులు లేవనే వివరాలను కార్యాలయ సిబ్బంది సేకరించింది. అనంతరం 345 మంది గిరిజనులకు ఇంటింటికీ వెళ్లి పాదరక్షలను పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బంది, స్థానిక సర్పంచ్ వెంకటరావు అందజేశారు. ఇవిధంగా పవన్ కల్యాణ్‌ గొప్ప మనస్సు చాటుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమపట్ల స్పందించిన తీరుపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 01:34 PM