AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:24 AM
Yalamanchili Municipal Chairperson: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై మంగళవారం నాడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఎలమంచిలిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ రమాకుమారిపై ఇవాళ(మంగళవారం) అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నర్సీపట్నం ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారి హోదాలో ప్రత్యేక సమావేశం నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును గత నెల 27వ తేదీన అధికారులకు వైసీపీ పార్టీ కౌన్సిలర్లు అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కాగా.. ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలు 2021 మార్చిలో జరిగాయి. ఈ ఎన్నికల్లో 25 వార్డులకు గానూ 23 వార్డులు వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్లు కాగా.. ఒక వార్డులో టీడీపీ, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఐదో వార్డు నుంచి ఎన్నికైన రమా కుమారిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రమా కుమారి వైసీపీని వీడి బీజేపీలో చేరారు.
అయితే ఆమె వైసీపీని వీడటంతో ఆ పార్టీలోని పెద్దలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు వైసీపీ కౌన్సిలర్లను కూడా పార్టీ ఆ పెద్దలు ఒప్పించడంతో రమాకుమారిపై ఇవాళ అవిశ్వాసం తీర్మానం పెట్టనున్నారు. ఇటీవల కొన్ని మున్సిపాల్టీలను కూటమి సర్కార్ చేజిక్కించుకుంటున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ అగ్ర నేతల వ్యవహారం కారణంగా ఆయా మున్సిపాల్టీల్లోని కౌన్సిలర్లు కూటమి సర్కార్‌కు జై కొడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
Kakani Govardhan Reddy: కాకాణికి లభించని ఊరట
PM Modi Visits to Amaravati: మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు
For More Andhra Pradesh News and Telugu News..