CM Ramesh VS KTR: ఆ ఆరోపణలు నిరూపించు.. కేటీఆర్‌కి ఎంపీ రమేష్ మాస్ సవాల్
ABN , Publish Date - Jul 26 , 2025 | 06:02 PM
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.

అనకాపల్లి జిల్లా: తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ (KTR) తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై మీడియా ముందు బహిరంగ చర్చకి రావాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సవాల్ విసిరారు. తెలంగాణలో తనకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.1650 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ(శనివారం) అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లు అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రిత్వి ప్రాజెక్ట్ రూ.2000 కోట్లతో పనులు చేపట్టారని... వాటిని నామినేషన్ కింద ఇచ్చారా అని ప్రశ్నించారు ఎంపీ సీఎం రమేష్.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బురద జల్లాలని తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపటి ఉన్నట్లుగానే.. తెలంగాణలో కేటీఆర్‌కి ఉందని ఆరోపించారు. దీని నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ కలిసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీతో బీఆర్ఎస్‌ను విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పిన మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు ఎంపీ సీఎం రమేష్.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ తెలంగాణ, ఏపీతోపాటు, దేశ ప్రజలందరికీ జవాబు చెప్పాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News