MP Ramesh: నా తల్లి ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ రమేష్
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:32 PM
తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని అనకాపల్లి ఎంపీ రమేష్ పేర్కొన్నారు. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (Anakapalle MP CM Ramesh) తెలిపారు. హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ రమేశ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని వార్త పత్రికల్లో, వాట్సాప్ గ్రూపుల్లో తన తల్లి స్వర్గస్తులు అయ్యారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని వాపోయారు. దయచేసి ఎవరూ అలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని విన్నవించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆమెకు నిరంతరం వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం తరపున అందరూ చేస్తున్న ప్రార్థనలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అనకాపల్లి ఎంపీ రమేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య
పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి
Read Latest AP News And Telugu News