Share News

Breaking News: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం..

ABN , First Publish Date - Mar 04 , 2025 | 09:30 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం..
Breaking News

Live News & Update

  • 2025-03-04T21:35:32+05:30

    భారత్ ఘన విజయం..

    • ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

    • ఆసీస్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు చేరింది.

  • 2025-03-04T21:09:52+05:30

    భారత్‌కు బిగ్ షాక్.. కోహ్లీ ఔట్..

    • టీమిండియాకు బిగ్ షాక్..

    • గెలుపు ముంగిట పెద్ద ఎదురుదెబ్బ తగలింది.

    • భారత్‌ను విజయ తీరాలకు చేరుస్తాడనుకున్న కోహ్లీ ఔట్ అయ్యాడు.

    • విరాట్ కోహ్లీ(84) ఔట్ అయ్యాడు.

    • ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 225/5

  • 2025-03-04T20:12:29+05:30

    శ్రేయాస్ అయ్యర్ ఔట్..

    • ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

    • శ్రేయాస్ అయ్యర్ ఔట్ అయ్యాడు.

    • భారత్ స్కోర్ 134/3

    • ఓవర్లు 26

  • 2025-03-04T19:04:14+05:30

    రెండు వికెట్లు కోల్పోయిన భారత్..

    • భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.

    • కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్‌బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు.

    • భారత్ స్కోర్ 43/2

  • 2025-03-04T18:41:18+05:30

    భారత్ ఇన్నింగ్స్ స్టార్ట్.. దుమ్మురేపుతున్న రోహిత్..

    • భారత్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది.

    • రొోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడు.

  • 2025-03-04T18:02:54+05:30

    ఆస్ట్రేలియా ఆలౌట్..

    • ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసిస్ ఆలౌట్.

    • 264 పరుగలకు ఆలౌట్ అయిన ఆసిస్.

    • భారత్ లక్ష్యం 265 పరుగులు.

  • 2025-03-04T17:59:13+05:30

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    • ఆసిస్ టీమ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

    • 262 పరుగుల వద్ద నాథన్ ఎలిస్ ఔట్ అయ్యాడు.

    • మహ్మద్ షమీ బౌలింగ్‌లో షాట్ ప్రయత్నించగా.. కోహ్లీ క్యాచ్ పట్టాడు.

    • ఆసిస్ స్కోర్ 262/9

  • 2025-03-04T17:46:36+05:30

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    • ఆసిస్ టీమ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

    • 249 పరుగుల వద్ద అలెక్స్(61) ఔట్ అయ్యాడు.

    • శ్రేయాస్ అయ్యర్.. అలెక్స్‌ను రనౌట్ చేశాడు.

    • ఆసిస్ స్కోర్ 249/8

  • 2025-03-04T17:09:51+05:30

    ఆసిస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఆరో వికెట్ డౌన్..

    • టీమిండియా బౌలర్లు చెలరేగి ఆడుతున్నారు.

    • బౌలింగ్ ధాటికి అసిస్ బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు.

    • ఆరో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.

    • 205 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్(7) ఔట్ అయ్యాడు.

  • 2025-03-04T17:04:02+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన ఆసిస్..

    • 198 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్(73) ఔట్.

  • 2025-03-04T16:27:02+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసిస్..

    • ఫుల్ ఫామ్‌లో ఉన్న జోష్ ఇంగ్లిస్ (11)ను జడేజా పెవిలియన్‌కు పంపించాడు.

    • జడేజా బౌలింగ్‌లో ఇంగ్లిస్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ చక్కగా ఒడిసిపట్టాడు.

    • ఈ మ్యాచ్‌లో జడ్డూకు ఇది రెండో వికెట్ కావడం గమనార్హం.

  • 2025-03-04T16:10:58+05:30

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    110 పరుగుల వద్ద లబుషేన్ (29) ఔట్ అయ్యాడు.

    రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అతడు ఔట్ అయ్యాడు.

  • 2025-03-04T15:56:00+05:30

    ఆసిస్ ప్లేయర్స్‌కి చుక్కలే..

  • 2025-03-04T15:49:56+05:30

    17 ఓవర్లు పూర్తి.. ఆసిస్ స్కోర్ ఎంతంటే..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసిస్ జట్టు.. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ప్రస్తుత క్రీజ్‌లో లబుషేన్, స్టీవెన్ స్మిత్ ఉన్నారు.

  • 2025-03-04T15:43:18+05:30

    15 ఓవర్లు పూర్తి.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..

    తొలి బంతి నుంచే విరుచుకు పడుతూ చూస్తుండగా రిజల్ట్‌ను తారుమారు చేసే రాక్షసుడి ఆట కట్టించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టీమిండియా అదరగొడుతోంది. 54 పరుగులకే ఇద్దరు కంగారూ బ్యాటర్లను వెనక్కి పంపి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలుత కొనొల్లీని వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఔట్ చేయగా.. ఆ తర్వాత డేంజరస్ ట్రావిస్ హెడ్‌ను వరుణ్ వెనక్కి పంపించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసిన హెడ్.. భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతుండగా అతడికి బ్రేక్ వేశాడు వరుణ్. అతడి ఔట్‌తో టీమిండియాలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. స్టేడియంలోని భారత అభిమానులు కూడా ఈ వికెట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

  • 2025-03-04T14:21:33+05:30

    టాస్ ఓడిన భారత్

    • టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అదృష్టం మరోసారి వెక్కిరించింది.

    • హిట్‌మ్యాన్ మళ్లీ టాస్ ఓడిపోయాడు.

    • ఇటీవల కాలంలో వరుసగా టాస్ ఓడిపోతున్న భారత సారథికి మళ్లీ అదే రిపీట్ అయింది.

    • ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు రోహిత్.

    • టాస్ గెలిచిన కంగారూ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

    • టీమిండియా ఇప్పుడు బౌలింగ్‌కు దిగనుంది.

    • టాస్ పోయినా ఫర్వాలేదు.. మ్యాచులు గెలిచే సెంటిమెంట్ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

      IND-vs-AUS-Toss.jpg

  • 2025-03-04T12:38:42+05:30

    గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాజశేఖరం

    • గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో కూటమి అభ్యర్థి రాజశేఖరం గ్రాండ్ విక్టరీ

    • తొలి ప్రాధాన్యత ఓటుతోనే కోటా ఓట్లు సాధించిన రాజశేఖరం

    • వీర రాఘవులపై ఘన విజయం సాధించిన రాజశేఖరం

    • కృష్ణ, గుంటూరు పట్టభద్రుల స్థానంలోనూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు

  • 2025-03-04T12:07:11+05:30

    అసెంబ్లీలో ఎంఎస్‌ఎంఈపై చర్చ

    • అసెంబ్లీలో ఎంఎస్‌ఎంఈ పై చర్చ

    • ఎంఎస్‌ఎంఈలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

    • ఇండస్ట్రీ ప్రమోషన్ పై అవగాహన కల్పిస్తున్నామన్న మంత్రి

    • మండల స్థాయిలో ఎంటర్ ప్రెన్యూర్ లకు శిక్షణ

    • ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి చర్యలు

  • 2025-03-04T12:07:10+05:30

    అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో దొరకని నిందితుల ఆచూకీ

    • జనవరి 16 న అఫ్జల్ గంజ్‌లో కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నిందితులు

    • నిందితులు అలోక్ కుమార్, అమన్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీసులు

    • ఇద్దరు నిందితుల కోసం 4 రాష్ట్రాల్లో 50 రోజులుగా వెతుకుతున్న పోలీసులు

    • నిందితులు ఇద్దరు బార్డర్ దాటి నేపాల్ పారిపోయినట్టు అనుమానిస్తున్న పోలీసులు

    • బీదర్ లో 87 లక్షలు కొట్టేసి, ఇద్దరినీ చంపేసి హైదరాబాద్ వచ్చిన నిందితులు

    • హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్న నిందితులు

    • అఫ్జల్ గంజ్‌లో ఫైరింగ్ చేసి పారిపోయిన నిందితులు

    • నిందితుల కోసం ఇప్పటికే వందలాది సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు

  • 2025-03-04T11:36:04+05:30

    కూటమి ఆధిక్యం..

    • కొనసాగుతున్న ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    • ఇప్పటివరకు 6 రౌండ్లు పూర్తి

    • 6వ రౌండ్‌లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యం

    • ఇప్పటి వరకు మొత్తం 96,291 ఓట్లు సాధించిన రాజశేఖరం

    • ఆరవ రౌండ్లో 16,254 ఓట్లు సాధించిన రాజశేఖరం

    • పిడిఎఫ్ అభ్యర్ధి వీరరాఘవులకు ఇప్పటి వరకు 35,614 ఓట్లు,

    • ఆరవ రౌండ్లో 5,949 ఓట్లు సాధించిన వీర రాఘవులు

    • ఇప్పటి వరకు 1,680,00 ఓట్లు లెక్కింపు

    • ప్రతి రౌండ్ లోనూ 28వేల ఓట్లు లెక్కింపు

  • 2025-03-04T11:12:57+05:30

    తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్

    • తల్లికి వందనం పథకంపై త్వరలోనే మార్గదర్శకాలు

    • శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడి

    • కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేస్తుంది

    • తల్లికి వందనం పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు

  • 2025-03-04T10:26:25+05:30

    శాసన మండలి లో మంత్రి నారా లోకేష్

    • మార్చి లోనే డిఎస్పీ నోటీఫికేషన్

    • గత టిడిపి ప్రభుత్వం లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం

    • ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ చేపడతాం

  • 2025-03-04T09:33:17+05:30

    విజయం దిశగా

    • తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కొనసాగుతున్న కౌంటింగ్

    • వేగంగా కౌంటింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు

    • సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశం

    • లీడింగ్‌లో కూటమి అభ్యర్థి రాజశేఖరం

    • రాజశేఖరం వెనుకపడతారంటూ పోలింగ్ ముగిశాక వైసీపీ ప్రచారం

    • కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన యువత

    • గ్రాడ్యుయేట్ ఓటర్ల స్పష్టమైన తీర్పు

  • 2025-03-04T09:30:11+05:30

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    • ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

    • ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

    • వివిధ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న సభ్యులు

    • సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానం