Share News

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

ABN , Publish Date - Mar 04 , 2025 | 01:33 PM

బెంగళూరు ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

గుంతకల్లు(అనంపురం): బెంగళూరు ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-మైసూరు(Kacheguda-Mysore) (నం. 12785) ఎక్స్‌ప్రెస్‌ రైలు, బెంగళూరు-ధర్మవరం (నం. 06595), ముంబై-బెంగళూరు (నం. 11301), ముంబై-కోయంబత్తూరు (నం. 11013), భువనేశ్వర్‌-బెంగళూరు (నం. 18463), దర్బంగ-మైసూరు (నం. 12577) అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లకు ఈ నెల 13వ తేదీ నుంచి నిరవధికంగా బెంగళూరు ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌(Bangalore East Railway Station)లో స్టాపింగ్‌ను తొలగించినట్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Railway Station: నమ్మండి.. ఇది రైల్వేస్టేషనే..


హిందూపురం ప్యాసింజర్‏కు..

pandu4.2.jpg

మక్కాజిపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ప్రయాణికుల వసతికి సంబంధించిన పనుల కారణంగా ఆ స్టేషన్‌లో గుంతకల్లు-హిందూపురం-గుంతకల్లు ప్యాసింజరు (నం. 77213/14) రైళ్ల స్టాపింగ్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ వరకూ మక్కాజిపల్లి స్టేషన్‌లో హిందూపురం ప్యాసింజరును నిలపరని తెలిపారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 01:33 PM