CM Chandrababu:ఇవాళ బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 26 , 2025 | 06:50 AM
AP CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నాడు ఫుల్ బిజీగా ఉండనున్నారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి ఇవాళ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

శ్రీకాకుళం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ (శనివారం) బిజీ బిజీగా ఉండనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు ప్రభుత్వం పెంచింది. మత్స్యకారులకు రూ. 258 కోట్లు నిధులను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం 1500 మంది భద్రతా సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి, అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి వస్తుండటంతో బుడగట్లపాలెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మత్స్యకారులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
Veerayya Chowdary: మూడు మాఫియాల పగ
YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం
Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
Read Latest AP News And Telugu News