Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
ABN , Publish Date - Jul 24 , 2025 | 08:31 AM
హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.

అమరావతి: మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జులై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23 వ తేదీ రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
సీఎం పోస్ట్ ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారికి, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ' అని పోస్టులో పేర్కొన్నారు..
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సీఎం అయ్యాక రిలీజ్ అయిన మొదటి సినిమా హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లకుపైగా సెట్స్ పై ఉన్న పవన్ తొలి చారిత్రాత్మక చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. అయితే, హరిహర వీరమల్లుగా పవన్ వన్ మ్యాన్ షో చేశాడని టాక్ నడుస్తోంది.
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు!
For More Telugu News