Share News

Hyderabad: అమ్మో.. మొత్తం రూ. 36 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 24 , 2025 | 07:10 AM

‘మీపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది’ అంటూ సైబర్‌ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్‌ క్రైంపోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు.

Hyderabad: అమ్మో.. మొత్తం రూ. 36 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

- మీపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది

- సీబీఐ పేరుతో వృద్ధుడికి బెదిరింపులు

- 35.74 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ‘మీపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది’ అంటూ సైబర్‌ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్‌ క్రైంపోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు. హైదరాబాద్‌ దోమలగూడ(Hyderabad Domalaguda) ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 6న వాట్సాప్‌ వీడియో కాల్‌(WhatsApp video call) వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి సీబీఐ అధికారి విజయ్‌ ఖన్నాగా పరిచయం చేసుకున్నాడు.


ముంబై కొలాబా పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని చెప్పాడు. ‘మీ పేరుతో కొలాబా కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉంది. దాని నుంచి అక్రమంగా విదేశాలకు డబ్బు తరలింద’ని భయపెట్టాడు. ప్రధాన నిందితుడు నితీష్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేశామని, అతడికి సహకరించిన వారిపై కూడా మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పాడు. అరెస్ట్‌ వారెంట్‌లు, సుప్రీంకోర్టు ఆదేశాలంటూ నకిలీ పత్రాలు చూపి, ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేస్తామని బెదిరించాడు.


city1.jpg

ఇది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన కేసు అని, ఈ దర్యాప్తు గురించి ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. ‘మీపై కేసు తొలగించాలంటే మీ ఖాతాలో ఉన్న డబ్బును భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఖాతాలకు బదిలీ చేయాల’ని సూచించాడు. ఆర్బీఐ అధికారులు తనిఖీచేసి, ఆ డబ్బు సరైన పద్ధతుల్లో వచ్చిందేనని నిర్ధారించుకుని తిరిగి ఇస్తారని నమ్మబలికాడు. తర్వాత కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న ఆయుష్‌ గుప్తా అనే వ్యక్తి రోజూ ఫోన్‌ చేస్తూ డబ్బు బదిలీ చేయాలని,


లేకుంటే అరెస్ట్‌ తప్పదంటూ భయపెట్టేవాడు. ఇలా సైబర్‌ నేరగాళ్లు 10 రోజుల్లో రూ..35.79 లక్షలు పలు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల’ని చెప్పారు. వారి మాటలు నమ్మి డబ్బు కోసం ఆ వృద్ధుడు సైబర్‌ క్రైం స్టేషన్‌కు రావడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2025 | 07:11 AM