Somireddy: ఏపీ లిక్కర్ స్కాం.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:13 PM
ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అమరావతి: ఏపీలో జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం (AP Liquor Scam) అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెహల్‌గామ్ టెర్రరిస్ట్‌లపై తీసుకున్న చర్యలు చూశామని... అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటారని.. కానీ లిక్కర్ స్కాంలో చాలామంది పేదల ప్రాణాలు పోయాయని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసు, కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతోందని.. అలాగే ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఇది రూ. 3200 కోట్ల మద్యం స్కాం కాదని.... 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఈ స్కాంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు...ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించిందని.. అలాగే ఏపీ మద్యం స్కాంపై కూడా ఈడీ విచారణ చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి..
నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’
ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
Read latest AP News And Telugu News