Share News

Kotamreddy Question To Jagan: అసలు, సిసలు సైకో పార్టీ వైసీపీ.. కోటంరెడ్డి ఫైర్

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:13 PM

Kotamreddy Question To Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విలేకరుల సమావేశం అంటే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని, రాష్ట్రానికి మేలు చేసేవి చేస్తారని భావించానని... కానీ అబద్ధాలతో కూడిన మాటలు ఆశ్చర్యం వేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Kotamreddy Question To Jagan: అసలు, సిసలు సైకో పార్టీ వైసీపీ.. కోటంరెడ్డి ఫైర్
Kotamreddy Question To Jagan

నెల్లూరు, జులై 16: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ప్రజల సమస్యలపై కాకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ సైకోల పార్టీ కాదని.. వైసీపీ సైకో పార్టీ అని గుర్తించే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అంతే కాకుండా ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డిని జగన్ ప్రశంసించడం కూడా ఆశ్చర్యకరమే అంటూ ఎద్దేవా చేశారు. జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోస్ట్ చేశారు.


కోటంరెడ్డి ట్విట్టర్ పోస్ట్..

‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విలేకరుల సమావేశం అంటే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని, రాష్ట్రానికి మేలు చేసేవి చేస్తారని భావించా. కానీ అబద్ధాలతో కూడిన మాటలు ఆశ్చర్యం వేసింది. ఆంధ్రప్రదేశ్ ఆటవిక రాజ్యంగా తయారైందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యం చేసింది జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని సైకోల పార్టీగా జగన్ రెడ్డి అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు, సిసలు సైకో పార్టీగా వైసీపీని గుర్తించి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా బుద్ధి రాలేదు. అత్యంత ఆశ్చర్యకరం జగన్ రెడ్డి అబద్దాలకు సైకో చర్యలకు పరాకాష్ట ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డిని మచ్చలేని అధికారిగా జగన్ ప్రశంసించడం. ధనుంజయరెడ్డి లాంటి మంచి అధికారిని కూడా వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉంది. అయ్యా జగన్ రెడ్డి నీకు ధనుంజయ్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే, ధనుంజయ్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, తప్పు చేస్తే కేసు నమోదు చేయమని సీబీఐకి లేఖ రాయగలవా..? సూటిగా, స్పష్టంగా నా ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పగలిగితే సంతోషం’ అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వైసీపీ నేతల నిందల్ని మోస్తూ సేవాతత్వంతో ముందుకు: మంత్రి ఆనం

కేంద్రమంత్రి మన్సుఖ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 03:22 PM