Share News

Anitha Slams Jagan: రప్పా రప్పా అంటూ జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్

ABN , Publish Date - Jul 16 , 2025 | 02:03 PM

Anitha: జగన్‌పై హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. రప్పా రప్పా అని వైసీపీ నేతలు అనడాన్ని జగన్ సమర్థిస్తున్నారని ఫైరయ్యారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు. రౌడీషీటర్లను పరామర్శిస్తున్న వ్యక్తి జగన్ అని చురకలు అంటించారు.

Anitha Slams Jagan: రప్పా రప్పా అంటూ జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్
Vangalapudi Anitha

ఆంధ్రప్రదేశ్, జులై 16: ఈరోజు పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పర్యటించారు. ఇంటింటికి వెళ్ళి ఏడాడి కాలంలో ప్రభుత్వం (NDA Government) చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను (Government Schemes) వివరించారు. అనంతరం పాయకరావుపేటలో (Payakaraopeta) చేనేత సహకార సంఘాన్ని పరిశీలించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. జమదాని చీర్లకు గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు . చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పాయకరావుపేట పట్టణంలో జమాదాని చీరలు నేయడం శుభపరిణామని.. చేనత కార్మికులకు చేయూతను ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను సంభందించిన మంత్రి దృష్టికి తీసుకొని వెళతామన్నారు.


జగన్ రెడ్డిది నీచ చరిత్ర...!

వైసీపీ అధినేత, మాజీ జగన్‌పై (YS Jagan) అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని అన్నారు. 50 వేల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని (MLA Prashanthi Reddy) వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి (Prasanna Kumar) చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. చెల్లి వరసయ్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పు పట్టాయని.. కానీ జగన్ కు ఆ వ్యాఖ్యలు తప్పుల్లా కనిపించడం లేదని ఫైరయ్యారు. ప్రసన్నకుమార్ రెడ్ది.. జగన్ దగ్గరే నేర్చుకున్నారని చురకలు అంటించారు.


రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది అని ఆరోపించారు. రౌడీషీటర్లను, బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగట్టుకోని ఆత్మహత్య చేసుకున్న వారినే జగన్ పరామర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. జగన్ ఒకసారి తలకాయ, మరోసారి మామాడికాయ తొక్కించారని చురకలు అంటించారు. జగన్ చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు కూడా ఆలోచన చేయాలని హితవు పలికారు. ఒక ప్రజాప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రసన్నకుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇవి కూడా చదవండి..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..

Updated Date - Jul 16 , 2025 | 02:03 PM