BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకు బిగ్ షాక్!
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:39 PM
AP High Court: వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి కుమార్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

కొవ్వూరు, జులై 16: టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేసింది.
ఏడు ఏళ్ల లోపు శిక్ష..!
పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని ఏడు ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు అని నల్లపురెడ్డి తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సెక్షన్లు కూడా ఆయనకు వర్తించవు అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి తొలిరోజు ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మళ్ళీ రెండవ రోజు కూడా పునరుద్ఘాటించారు అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్ని ఏడేళ్లు లోపు శిక్ష పడేవి కావడంతో ప్రసన్నకుమార్ రెడ్డి ను BNS లోని 35(3) ప్రకారం పిలిచి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మల్నాడు డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు
హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే