Minister Anam: అధికారులు హాఫ్‌మైండ్‌తో పనులు చేయొద్దు.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:05 PM
Minister Anam Ramanarayana Reddy: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమృతధార పథకంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్‌లు సరిగా లేవని అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నెల్లూరు: ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2058వ సంవత్సరం లోపు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో అమృతధార పథకం చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా 46 మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందివ్వడమే ఏపీ ప్రభుత్వ (AP Govt) లక్ష్యమని చెప్పారు. అమృతధార పథకం కోసం రూ.8400 కోట్ల నిధులు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. అమృతధార పథకం కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందారని అన్నారు.
అధికారులు ధోరణి మార్చుకోవాలి..
ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టంగా లేని రిపోర్ట్ ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారని.. ఇలాంటి ధోరణిని వారు వెంటనే మార్చుకోవాలని హెచ్చరించారు. హాఫ్ మైండ్ వర్క్ చేయొద్దని మందలించారు. అధికారులు పనిలో నిమగ్నమై సరైన డీపీఆర్ పంపించాలని అన్నారు. అధికారులకు తెలిసిందే రూల్ అనేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పై రేపు(శనివారం) క్యాబినెట్‌లో తాను వివరించాల్సి ఉంటుందని అన్నారు. సమగ్రత లేని రిపోర్ట్‌తో ప్రాజెక్ట్ పనులు మధ్యలో ఆగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అధికారులు కేత్ర స్థాయిలో ప్రాజెక్ట్‌లను పరిశీలించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిగా వినియోగించుకోకపోతే వృథా అవుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించడానికి కృషి..
గ్రామీణ వ్యవస్థను మెరుగు పరచడం, శుద్ధి చేసిన నీటిని ప్రజలకు అందించడం అమృతధార పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాలు, అవకాశాలను ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ప్రణాళికను ప్రారంభించిందని అన్నారు. గ్రామాల్లో కొళాయిలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించాలనేది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఈ పథకం విజయవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు.
జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం..
ఎక్కడైతే పెద్ద రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ అమృతధార పథకం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ప్రణాళిక అని వివరించారు. సోమశిల నుంచి 23మండలాలు, కండలేరు ప్రాజెక్ట్ నుంచి మరో 23మండలాలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రూ.8, 400 కోట్ల నిధులతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46మండలాలకు 2058 సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుని తాగు నీరు ఇస్తామని అన్నారు. సోమశిల నుంచి 1.5 టీఎంసీలు, కండలేరు నుంచి 2.6 టీఎంసీలు ఉపయోగించుకుంటామని చెప్పారు. పాత రిజర్వాయర్లు తొలగించి.. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని... ఇప్పుడు మళ్లీ ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sanjay: సంజయ్ సస్పెన్షన్‌పై సర్కార్ కీలక నిర్ణయం
AP News: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే..
Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే
Read Latest AP News And Telugu News