Nellore Terrorist: నెల్లూరు వాసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. అసలు విషయం తెలిస్తే షాక్
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:26 PM
Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్‌కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఉగ్రవాదుల వ్యవహారాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. నాంపల్లి హైకోర్టులో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్ లొంగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలియాజ్ అహ్మద్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. కొన్నాళ్ల కిందట బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్ఐఏ సోదాలు చేసింది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మారణహోమాలు సృష్టించే స్థాయికి పీఎఫ్ఐలో ఇలియాజ్ అహ్మద్ ఎదిగాడు. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి సాయుధ శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. జిల్లా నుంచి ఎవరైనా యువకులకు పీఎఫ్ఐలో శిక్షణకు తీసుకెళ్లారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దర్యాప్తులో ఎన్ఐఏ వేగం..
కాగా.. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల నుంచి సమాచారం రాబట్టడానికి చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసులో నెల్లూరు జిల్లా జైలుకు హైదరాబాద్ పేలుళ్లకు సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనుక కొంతమంది పేరుమోసిన ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నెల్లూరు జైలులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులపై దర్యాప్తు అధికారుల దృష్టి పడింది. హైదరాబాద్ పేలుళ్లకు నెల్లూరు జిల్లా జైలులో ఏమైనా పథకం రచించారా అనే అనుమానాలతో దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. అయితే, ఈ విషయాలను నెల్లూరు జిల్లా అధికారులు ధ్రువీకరించడం లేదు. దిల్‌సుక్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 16 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గతంలో చర్లపల్లి జైలులో దాడి తర్వాత సిరాజ్, అలీ బాయ్ అనే ఉగ్రవాదులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ ఇలియాస్ అహ్మద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి, చంచల్‌గూడ జైలుకు పంపించింది. నిజామాబాద్ పీఎఫ్‌ఐ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మూడో నిందితుడిగా పేరు చేర్చింది. అతను 2022 నుంచి పరారీలో ఉన్నాడు. ఆయన తలపై రూ. 2 లక్షల రివార్డ్ ప్రకటించారు.
పెద్ద ఎత్తున హింస సృష్టించేలా..
ఎన్ఐఏ ప్రకారం, షేక్ ఇలియాస్ అహ్మద్, ఇతర నిందితులతో పాటు, యువతను ప్రేరేపించారనే ఆరోపణలు ఉన్నాయి. యువతను పీఎఫ్‌ఐలోకి రిక్రూట్ చేయడం, వారికి సాయుధ శిక్షణ అందించడం, దేశంలో పెద్ద ఎత్తున హింసను సృష్టించడానికి ఇతర వర్గాలపై దాడులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారనే అభియోగాలు ఉన్నాయి. యువతకు పలు విభాగాల్లో శిక్షణ అందించాడు. తల, కడుపు, గొంతు వంటి కీలకమైన శరీర భాగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి చంపడం ఎలా అనే దానిపై యువకులకు శిక్షణ ఇచ్చే పనిలో అతడు పాల్గొన్నాడని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ కేసును మొదట జూన్ 2022లో నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు నమోదు చేశారు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ కీలకమైన ఇంటెలిజెన్స్‌ను సేకరించి, ఏకకాలంలో పలు రాష్ట్రాల్లో దాదాపు 100 స్థానాల్లో దాడులు నిర్వహించింది. ఎన్ఐఏ స్లీపర్ సెల్స్, నెట్‌వర్క్‌లపై తమ దర్యాప్తులో వేగం పెంచడంతో అహ్మద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.
11 మంది నిందితులపై ఛార్జిషీట్..
2022 డిసెంబర్‌లో, తెలంగాణ పోలీసుల నుంచి.. ఆగస్టు 2022లో కేసు దర్యాప్తును ఎన్ఐఏ స్వీకరించింది. ఆ తర్వాత ఈ కేసులో 11 మంది నిందితులపై ఎన్ఐఏ తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 2023లో, ఎన్ఐఏ ఇదే కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. నిందితులు భారత ప్రభుత్వంతో, దేశంలో ఉండే కీలక వ్యక్తులపై ద్వేషం, విషంతో కూడిన ప్రసంగాల ద్వారా ముస్లిం యవకులను రెచ్చగొట్టి పీఎఫ్‌ఐలోకి చేర్చుకుంటున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్‌ఐలో రిక్రూట్ అయిన తర్వాత, ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ (PE) బిగినర్స్ కోర్సు (BC) ముసుగులో వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఎంహెచ్ఏ(MHA) ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Sanjay: సంజయ్ సస్పెన్షన్‌పై సర్కార్ కీలక నిర్ణయం
AP News: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే..
Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే
Read Latest AP News And Telugu News