Share News

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:28 PM

నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..
TG Bharat on YCP Liquor Scam

కర్నూలు: మద్యం కేసులో మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టి పెట్టి ప్రజలను నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ UPI చెల్లింపులు చేస్తున్నప్పటికీ.. జగన్ హయాంలో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే తీసుకోవడం ఇందుకు సాక్ష్యమని ఉదహరించారు. క్యాష్ ఇస్తేనే మద్యం అమ్మకాలు అంటూ భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని అన్నారు. మద్యం కుంభకోణంపై ఆ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు.


సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.. టీజీ భరత్

లిక్కర్ స్కాంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోయినా.. రేపో.. ఎల్లుండో నిందితులకు శిక్ష తప్పదని.. ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ కూతురు కవితనే లిక్కర్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లివచ్చారని ఉదహరించారు. మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళను లోపలేస్తే..వైసీపీ వాళ్ళు పరామర్శలకు వెళ్తున్నారని మండిపడ్డారు.


ఒక పక్క రేపే ఎన్నికలు జరుగుతాయనే రీతిలో వైసీపీ నేతలు హడావుడి చేస్తుంటే.. మరో పక్క ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి రేపే సీఎం అవుతున్నట్లు ఊహా లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మంచి జరగకూడదు.. పెట్టుబడులు రాకూడదు.. ప్రజలు సంతోషంగా ఉండకూడదనేదే వైసీపీ పార్టీ కోరుకుంటోందని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు.


ఇవి కూడా చదవండి

కొడాలి నానికి బిగ్ షాక్!
మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 02:35 PM