Share News

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 30 , 2025 | 08:43 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన
Srisailam Temple

నంద్యాల, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి (Srisailam Bhramaramba Mallikarjuna Swamy) భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి(సోమవారం) నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు. రూ. 300 టికెట్ తీసుకున్న భక్తులకు ఒక్క లడ్డూ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.


భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేయడం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఇవాళ(ఆదివారం) ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు(సోమవారం) వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పరమేశ్వరుడును దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే భారీగా శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

Read Latest AP News and National News

Updated Date - Nov 30 , 2025 | 09:06 PM